పున్నమి న్యూస్ ప్రతినిధి
తెలంగాణ ఇంచార్జ్
9640204826
24 ఫిబ్రవరి 2026
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం ధర్మన్నగూడ గ్రామంలో
శ్రీ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి పేరు మీద ఉన్న మూడు ఎకరాల ఎండోమెంట్ భూమిని దొంగ చాటున భారతీయ జనతా పార్టీ మాజీ ఎంపీటీసీ గౌర మల్లేష్ సతీమణి గౌర వసంత పైన
తూలేఖర్డ్ రెవిన్యూ గల సర్వే నెంబర్ 98 /2 లో మూడు ఎకరాల భూమిని పట్టా చేసుకున్నారు.
శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిరక్షణ కమిటీ ధర్మన్నగూడ గ్రామ కమిటీ సభ్యులు అందరూ కలిసి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు
ఈ సందర్భంగా ధర్మన్నగూడ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ భూముల పరిరక్షణ కమిటీ గ్రామ అధ్యక్ష కార్యదర్శులు బండ మల్లేష్ మండల సత్యనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 98/2 లో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం పేరు మీద భూమి ఉందని తెలిపారు ఈ భూమిని గత 20 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటివరకు మాజీ ఎంపీటీసీ గౌర మల్లేష్ సాగు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు
గ్రామ ప్రజలంతా కలసి ఐక్యంగా పోరాడి ఆలయ భూమిని దక్కించుకోవాలని తెలిపారు
మాజీ ఎంపీటీసీ గౌర మల్లేష్ ధర్మన్నగూడ గ్రామ ప్రజలందరికీ మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఈ భూమిని సర్వే చేసి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పేరు పేరు మీదికి తక్షణమే మార్చాలి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి విజ్ఞప్తి చేశారు
ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ పరిరక్షణ కమిటీ సభ్యులు శశిధర్ రెడ్డి మండల నరసింహ. మండల గోపాలకృష్ణ మండల జంగయ్య కొంపోజు సురేష్ చారి. బుడిగలి మల్లేష్ బుర్రి వెంకటేష్ మండల నరేందర్ ఇతరులు పాల్గొన్నారు



