పున్నమి న్యూస్ ప్రతినిధి
తెలంగాణ ఇంచార్జ్
*రేపటికి ఉదయం 11 గంటలకు వాయిదా పడ్డ ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక* ….
రేపు కూడా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగేనా….?
కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కౌన్సిలర్ ఆకుల యాదగిరి వచ్చాకనే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని పోడియం వద్దకు పలుమార్లు వచ్చి వాగ్వాదానికి దిగారని వాగ్వాదానికి దిగారని,గగ్గోలు పెట్టారని ఆర్డిఓ అనంతరెడ్డి అన్నారు.
కౌన్సిలర్లు సృష్టించిన గందరగోళం వాళ్ళనే రెండుసార్లు వాయిదా వేసిన ఫలితం లేకపోయిందని అందుకే *రేపటికి వాయిదా వేసినట్లు ఎన్నికల అధికారి ఆర్డిఓ అనంతరెడ్డి తెలిపారు* .
నేను కేవలం ఎక్స్ ఆఫీసీయోమెంబెర్ గా నా ఓటు వినియోగించుకోవడానికి మాత్రమే మున్సిపల్ కు రావడం జరిగిందని, ఎన్నికల అధికారులు ఎలా చెప్తే అలాగే నడుచుకుంటానని *స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి* అన్నారు.
నూటికి నూరు శాతం బిఆర్ఎస్ పార్టీ పూర్తి ఆదిక్యంతో ఉండి, చైర్మన్ బై చైర్మన్ దక్కించుకుంటుందని జీర్ణించుకోలేక అక్కస్సుతోనే, ముమ్మాటికి అధికార పార్టీ చేస్తున్న తతంగం ఇది అని, దీనికి పోలీసులు,అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన…. *మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి*
ఈ మొత్తం ఘటనపై పై అధికారులకు,ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తామంటున్న బిఆర్ఎస్ పార్టీ నేతలు
భారీ ఉత్కంఠ నడుమ మున్సిపల్ కార్యాలయం నుండి వెళ్లిన బిఆర్ఎస్ కౌన్సిలర్స్





