అలంపూర్ : సెప్టెంబర్ 10 ( పున్నమి ప్రతినిధి )
జోగులాంబ గద్వాల జిల్లా, జిల్లా కోర్టులో ఈ నెల 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎన్.ప్రేమలత తెలిపారు. గద్వాల కోర్టు మరియు అలంపూర్ కోర్టులలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ వి.శ్రీనివాస్ తో కలిసి జాతీయ లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు సత్వర న్యాయం పొందవచ్చని తెలిపారు. సెప్టెంబర్ 13న శనివారం గద్వాల్, అలంపూర్ లోని న్యాయస్థానలో లోక్అదాలత్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రాజీ పద్దతిలో క్రిమినల్, సివిల్, ఆస్తి విభజన, కుటుంబపరమై, వైవాహిక జీవితం సంబంధిత, బ్యాంకు రికవరీ, చెక్ బౌన్స్, రోడ్డు ప్రమాదాలు ఇతర కేసులపై సంబంధించిన కేసులను ఇరుపక్షాల సమ్మతితో రాజీతో పరిష్కారమయ్యే కేసులన్నింటినీ పరిష్కరించడం జరుగుతుందని వివరించారు.
జాతీయ న్యాయ సేవా సంస్థ ప్రతిష్టాత్మకంగా ఈ లోక్ అదాలత్ ను నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో పేరుకు పోయిన పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించడానికి విశేష కృషి చేస్తుందన్నారు. రాజీ మార్గం రాజమార్గమని చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బులను వృథా చేసుకోవద్దని సూచించారు.గతంలో 8195 కేసులు పరిష్కరించి మన జిల్లా, రాష్ట్రంలోనే 11వ స్థానంలో నిలిచిందని తెలిపారు. జిల్లా ప్రజలంతా తమ కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించుకొని శాంతియుతంగా, సంతోషంగా జీవించాలని ఆమె కోరారు.

రాజీ మార్గం రాజమార్గం – జాతీయ లోక్ అదాలత్
అలంపూర్ : సెప్టెంబర్ 10 ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా, జిల్లా కోర్టులో ఈ నెల 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎన్.ప్రేమలత తెలిపారు. గద్వాల కోర్టు మరియు అలంపూర్ కోర్టులలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ వి.శ్రీనివాస్ తో కలిసి జాతీయ లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు సత్వర న్యాయం పొందవచ్చని తెలిపారు. సెప్టెంబర్ 13న శనివారం గద్వాల్, అలంపూర్ లోని న్యాయస్థానలో లోక్అదాలత్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రాజీ పద్దతిలో క్రిమినల్, సివిల్, ఆస్తి విభజన, కుటుంబపరమై, వైవాహిక జీవితం సంబంధిత, బ్యాంకు రికవరీ, చెక్ బౌన్స్, రోడ్డు ప్రమాదాలు ఇతర కేసులపై సంబంధించిన కేసులను ఇరుపక్షాల సమ్మతితో రాజీతో పరిష్కారమయ్యే కేసులన్నింటినీ పరిష్కరించడం జరుగుతుందని వివరించారు. జాతీయ న్యాయ సేవా సంస్థ ప్రతిష్టాత్మకంగా ఈ లోక్ అదాలత్ ను నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో పేరుకు పోయిన పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించడానికి విశేష కృషి చేస్తుందన్నారు. రాజీ మార్గం రాజమార్గమని చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బులను వృథా చేసుకోవద్దని సూచించారు.గతంలో 8195 కేసులు పరిష్కరించి మన జిల్లా, రాష్ట్రంలోనే 11వ స్థానంలో నిలిచిందని తెలిపారు. జిల్లా ప్రజలంతా తమ కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించుకొని శాంతియుతంగా, సంతోషంగా జీవించాలని ఆమె కోరారు.

