*మొoథా తుఫాన్ తో నష్టపోయిన రైతులందరికీ ఎకరానికి 50 వేల నష్టపరిహార ఇవ్వాలాని*
*బ్యాంక్ లో రుణాలు తీసుకున్న రైతులందరికి బ్యాంక్ ఇన్సూరెన్స్ కంపిణీ నష్టపరిహారం ఇవ్వాలి*
*చిల్పూర్ సిపిఎం పార్టీ మండల కమీటి ఆధ్వర్యంలో సీనియర్ అస్టెంట్ గారికి వినతిపత్రం*
*చిల్పూర్* సిపిఎం పార్టీ మండల కార్యదర్శి సాదం రమేష్ మాట్లాడుతూ మొన్న కురిసిన మొంథా తుపాన్ తో మండలంలో ఉన్న అన్ని గ్రామాలలో వరి, మొక్కజొన్న, పత్తి పంటలు చాలావరకు నష్టపోయారు, రైతులు ఆరు నెలలుగా కస్టపడి విత్తనాలు వేసి వేలాది పెట్టుబడులు పెట్టి చేతికి వచ్చే సమయంలో భారీ వర్షాలు కురిసి వరదలు వచ్చి పొలాలలో ఇసుకమెట్టలు వచ్చి వరి చేనులు కోయరాకుండా బురదలో మునిగిపోయాయి. మొక్కజొన్నలు తడిసి మొలకలు వచ్చి నల్లబారి పోయాయి, పత్తి చేను మీదనే కింద బడి నల్లబారీ మొలకెత్తిన పరిస్థితి ఉన్నది. కాబట్టి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి పూర్తి స్థాయిలో విచారణ చేసి నష్టపోయిన రైతులకు ఎకరానికి 50 వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని,
వర్షకాలం ముందు వివిధ బ్యాంక్ లలో పట్టాదారు పసుపుస్తకాలు పెట్టుకొని పంటల ఋణం తీసుకునే ముందు బ్యాంక్ వారు పంటలకు ఇన్సూరెన్స్ క్రింద డబ్బులు కట్ చేసుకొని మీగిలిన డబ్బులు రైతులకు ఇచ్చారు అట్టి రైతులకు బ్యాంక్ ద్వారా వెంటనే ఇన్సూరెన్స్ ఇవ్వాలని అన్నారు.
మండలంలో ఉన్న అన్ని గ్రామలలో రోడ్లు తెగినవి కొన్ని చోట్ల పెద్ద పెద్ద గుంతలు పడినవి రోడ్ల వెంట పోయే రైతులకు, మరియు ప్రయాణం చేసే వారికీ ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది కావున వెంటనే స్పందించి రోడ్లు మరమ్మతులు చేయాలని ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉరడి లింగయ్య, ముడిక బీమయ్య,నారబోయన బిక్షపతి,ఊరడి బుచ్చిరాజ్ లు పాల్గొన్నారు.

