మునుగనూరులో పారుతున్న మురుగు…!
ప్రేక్షక పాత్రలో అధికారులు..!
పున్నమి న్యూస్ ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ :
29 మార్చి 2026
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభట్ల సర్కిల్ తుర్కయంజాల్ పరిధి ముంగనూరులో నూతనంగా ప్రారంభించిన సబ్ రిజిస్టర్ కార్యాలయానికి కూతవేటు దూరంలో రెండు నెలలుగా డ్రైనేజీ పొంగిపొర్లుతోంది. ఈ మురుగు నీరు దాదాపు కిలోమీటర్ వరకు పారుతోందని, స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిని దాటుకుంటూ పలు హోటల్లు, వ్యాపార సంస్థలకు తాకుతూ వెళ్తుందని దీంతో నిత్యం దుర్వాసనతో యుద్ధం చేస్తున్నామని వ్యాపారస్తులు తలలు పట్టుకుంటున్నారు. ఈ మధ్యనే తుర్కయంజాల్ మున్సిపాలిటీ గ్రేటర్ హైదరాబాద్లో కలిసిందని దీంతో ప్రజలకు మరింత సౌకర్యాలు కల్పించాల్సిన అధికారులే ఇలా ప్రేక్షక పాత్రలో ఉండటం అధికారుల తీర్పు అద్దం పడుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరుచుకొని మురుగునీటి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.







