మున్సిపల్ కార్మికుల రాష్ట్రవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి
యూనియన్ గౌరవ అధ్యక్షులు తాటిపాక మధు
రాజమహేంద్రవరం , కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరన్నర కావస్తున్న ఇప్పటికి మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని నిరంతరం ప్రజల ఆరోగ్యం కోసం పరితపించే మున్సిపల్ కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడవద్దని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు తాటిపాక మధు విమర్శించారు బుధవారం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద నవంబర్ 3న రాష్ట్రవ్యాప్తంగా జరిగే మున్సిపల్ కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని మున్సిపల్ కార్మికులు నిరసన ప్రదర్శన నిర్వహించారు.అంతకుముందు దేవి చౌక్ నుండి మున్సిపల్ ఆఫీసు వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు దారి పొడవున సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు .
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు మాట్లాడుతూ గత జగన్ ప్రభుత్వంలో ఆనాడు సమ్మె ఫలితంగా కొన్ని డిమాండ్లు నెరవేస్తామని మున్సిపల్ అధికారులు హామీ ఇచ్చారని అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు మున్సిపల్ కార్మికులు సమస్యలు పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చి నేటికీ ఆ సమస్యలపై పరిష్కారం చూపడం లేదని ఆయన అన్నారు .
ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలుగా ఆప్కాస్ లో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులు ఇతర కారణాలతో మరణించారని ఆ మరణించిన వారి వారసత్వ కుటుంబీకులకు అప్పకస్ ఉద్యోగం ఇవ్వడంలో పూర్తిగా విఫలం చెందారని ఆయన తెలిపారు 60 ఏళ్లు నిండిన మున్సిపల్ కుటుంబీకులకు వారసత్వ ప్రకారం ఇప్పటికే ఉద్యోగాలు ఇవ్వాలని అది కూడా తట్చారం చేస్తున్నారని మధు పేర్కొన్నారు .
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పిన ఇప్పటికీ అమలు చేయడం లేదన్నారు ఆప్కాస్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని మధు డిమాండ్ చేశారు
ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్ జట్లు లేబర్ యూనియన్ అధ్యక్షులు
కే రాంబాబు మాట్లాడుతూ ఎప్పటినుంచో మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వ బ్యాంకులో ఖాతాలు ఉన్నాయని కానీ నేడు తొందరగా ప్రభుత్వం యాక్సిస్ బ్యాంక్ ని అకౌంట్ ఓపెన్ చేయాలని చెప్పడం ఏదో కుట్ర దాగి ఉందని రాంబాబు తెలిపారు నవంబర్ 3న జరిగే మున్సిపల్ కార్మికుల సమ్మెకు అన్ని వర్గాల ప్రజలు కార్మిక లోకం మద్దతు ఇవ్వాలని ప్రభుత్వం వెంటనే చర్చిలకు పిలవాలని రాంబాబు సూచించారు ఇంకా ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రెడ్డి రమణ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లం వెంకటేశ్వరరావు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి దుర్గమ్మ జిల్లా నాయకులు కాకి శారద పోలమ్మ గిరి శ్రీను తదితరులు పాల్గొన్నారు

