Monday, 23 March 2026
  • Home  
  • మా డిమాండ్ల పరిష్కారం లేకపోతే — జిల్లా వ్యాప్తంగా షాపులు మూసి వేస్తాం*
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మా డిమాండ్ల పరిష్కారం లేకపోతే — జిల్లా వ్యాప్తంగా షాపులు మూసి వేస్తాం*

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం లో మద్యం వ్యాపారులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు .మద్యం పాలసీలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఖండిస్తూ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు 2024 – 2026 సంవత్సరాల మద్యం పాటదారులైన తమకు ప్రభుత్వం గెజిట్ ప్రకారం 20 శాతం కమిషన్ ఇవ్వాలని కోరుతూ వ్యాపారులు ఎక్సైజ్ సూపరింటెండెంట్‌ కు విన్నప పత్రం అందజేశారు.ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న 13.5 శాతం కమిషన్‌తో షాపులు నిర్వహించటం కష్టంగా మారిందని వారు పేర్కొన్నారు.అలాగే గెజిట్‌లో లేని పర్మిట్ రూములపై వసూలు చేస్తున్న రూ.7.5 లక్షల మొత్తాన్ని వాయిదాల రూపంలో చెల్లించే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను 15 రోజులలోపు పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా మద్యం షాపులను మూసివేయడానికైనా వెనుకాడమని హెచ్చరించారు.కోనసీమ లిక్కర్ అండ్ వైన్ డీలర్ అసోసియేషన్ తరఫున ఈ విన్నపం సమర్పించారు.తాడి నరసింహారావు, లింగోలు పెద్ద అబ్బులు,మామిడి గురవయ్య నాయుడు,నల్లమిల్లి సుబ్బారెడ్డి,పార్వతిని బాలయ్య చౌదరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం లో మద్యం వ్యాపారులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు .మద్యం పాలసీలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఖండిస్తూ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు
2024 – 2026 సంవత్సరాల మద్యం పాటదారులైన తమకు ప్రభుత్వం గెజిట్ ప్రకారం 20 శాతం కమిషన్ ఇవ్వాలని కోరుతూ వ్యాపారులు ఎక్సైజ్ సూపరింటెండెంట్‌ కు విన్నప పత్రం అందజేశారు.ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న 13.5 శాతం కమిషన్‌తో షాపులు నిర్వహించటం కష్టంగా మారిందని వారు పేర్కొన్నారు.అలాగే గెజిట్‌లో లేని పర్మిట్ రూములపై వసూలు చేస్తున్న రూ.7.5 లక్షల మొత్తాన్ని వాయిదాల రూపంలో చెల్లించే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
తమ న్యాయమైన డిమాండ్లను 15 రోజులలోపు పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా మద్యం షాపులను మూసివేయడానికైనా వెనుకాడమని హెచ్చరించారు.కోనసీమ లిక్కర్ అండ్ వైన్ డీలర్ అసోసియేషన్ తరఫున ఈ విన్నపం సమర్పించారు.తాడి నరసింహారావు, లింగోలు పెద్ద అబ్బులు,మామిడి గురవయ్య నాయుడు,నల్లమిల్లి సుబ్బారెడ్డి,పార్వతిని బాలయ్య చౌదరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.