ఓబులవారిపల్లి సెప్టెంబర్ 16(పున్నమి ప్రతినిధి)
ఓబులవారిపల్లె మండలం కొత్తపల్లెకి చెందిన ఒక మహిళను పెళ్లి చేసుకుంటానని చెప్పి గర్భవతిని చేసిన ముద్దాయి విజయ్ కుమార్ కు మంగళవారం కడప కోర్టు జీవిత ఖైదు శిక్షతో పాటు రూ. 80,000 జరిమానా విధించింది. నిందితుడు ఇప్పటికే వివాహితుడై ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కోర్టు తీర్పు నిందితుడికి గుణపాఠం అని, మహిళల రక్షణకు కఠిన చర్యలు, వేగవంతమైన విచారణ కొనసాగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు.


