01-05-2020 బుచ్చిరెడ్డిపాలెం (పున్నమి విలేఖరి – జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని దొడ్ల పద్మిని ఉమామహేశ్వరి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, జిల్లా రిసోర్స్ సభ్యులుగా పనిచేయుచున్న గండికోట సుధీర్ కుమార్ కు జాతీయ స్థాయి ప్రశంసాపత్రం లభించింది. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వే ఫౌండేషన్ ఎన్జీవోస్ కాన్సార్టియం మరియు వైద్యులు నిర్వహించిన జాతీయ స్థాయి వెబినార్ లో పాల్గొని *” పొగాకు కారకాలు – అనారోగ్య హేతువులు “* అనే అంశంపై ప్రసంగించినందుకు ఆయనను ప్రత్యేకంగా అభినందిస్తూ ఆన్లైన్ ద్వారా ప్రశంసా పత్రం అందజేసినట్టు గండి కోట సుధీర్ కుమార్ వివరించారు. పోగాకులో 64 రకాల క్యాన్సర్ కారకాలు ఉంటాయని ముఖ్యంగా యువత పోగాకుకు బానిసలవడం తనని తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశంసా పత్రం అందుకున్న గండికోట సుధీర్ ని మండల విద్యాశాఖాధికారి దిలీప్ కుమార్ మరియు సహోపాధ్యాయులు పలువురు అభినందించారు.
బుచ్చిరెడ్డిపాలెం నివాసి గండికోట సుధీర్ కుమార్ కు జాతీయస్థాయి ప్రశంశా పత్రం.