ఖమ్మం జనవరి
(పున్నమి ప్రతి నిధి)
నేలకొండపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఉన్నం బ్రహ్మయ్య గారి మాతృమూర్తి ఉన్నం అచ్చమ్మ గారు ఇటీవల స్వర్గస్తులయ్యారని తెలిసిన వెంటనే, భారతీయ జనతా పార్టీ పాలేరు అసెంబ్లీ కంటెస్టడ్ ఏం ఎల్ ఏ నున్నా రవికుమార్ ముజ్జుగూడెం గ్రామంలోని వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.
ఈ సందర్భంగా అచ్చమ్మ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం ఉన్నం బ్రహ్మయ్య గారికి, కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నేలకొండపల్లి మండల ప్రధాన కార్యదర్శి మల్లబోయిన గోవిందరావు, మైనార్టీ మోర్చా నాయకులు మొహియుద్దీన్, యువ మోర్చా నాయకులు సురేష్తో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.



