అన్నమయ్య జిల్లా ఆగస్టు పున్నమి ప్రతినిధి
మదనపల్లెలో ఆరు నెలల క్రితం జరిగిన బస్సు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన డ్రైవర్ శ్రీకాంత్ ను మంగళవారం జనసేన పార్టీ నాయకులు పరామర్శించారు. రాయలసీమ కోఆర్డినేటర్ దారం అనిత, హరిప్రసాద్, అశ్వత్, ధరణి, ప్రసాద్ లు శ్రీకాంత్ కు అండగా నిలిచి, రూ.15 వేల ఆర్థిక సహాయం అందించారు. శ్రీకాంత్ సమస్యను ఎమ్మెల్యే షాజహాన్ బాషా దృష్టికి తీసుకెళ్లి, మరింత సహాయం అందేలా చూస్తామని నాయకులు హామీ ఇచ్చారు.


