బరువు చూపకుండానే గ్యాస్ డెలివరీ…!
అమలుకు నోచుకోని ఎల్పిజి చట్టాలు ఎన్నో..!
నిత్యవసర వస్తువుల్లో ప్రధానమైనది గ్యాస్ అలాంటి గ్యాస్ వినియోగదారులకు అందించే సమయంలో దాని బరువుని నిర్ధారించి ఇవ్వాల్సి ఉంది.
పున్నమి న్యూస్ ప్రతినిధి
తెలంగాణ ఇంచార్జ్
04 ఏప్రిల్ 2026
9640204826
నిత్యవసర వస్తువుల్లో ప్రధానమైనది గ్యాస్ అలాంటి గ్యాస్ వినియోగదారులకు అందించే సమయంలో దాని బరువుని నిర్ధారించి ఇవ్వాల్సి ఉంది.
ఇలాంటి నిబంధనలు ఎన్నో ఎల్పిజి చట్టాల్లో ఉండగా చట్టానికే పరిమితమయ్యాయి. ఏదైనా పెద్ద సమస్య వస్తే తప్ప హడావిడి చేసే అధికారులు మిగతా సమయాల్లో కంటికి కూడా కనిపించరని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొందరు దళారులు గ్యాస్ సరఫరా లో ఎలాంటి అంతరాయం లేకున్నప్పటికీ కృత్రిమ కొరతతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. బ్లాక్ మార్కెట్లో గ్యాస్ రెండింతల ధరకి అమ్ముతున్నారు. ఎన్ని కఠిన నిబంధనలు వచ్చిన గ్యాస్ దారి మల్లక తప్పడం లేదు ఇదే అధికారుల పనితీరుకు అడ్డం పడుతుందని పలువురు వాపోతున్నారు. మూడు నెలలు రావాల్సిన గ్యాస్ ఇప్పుడు రెండు నెలలు మాత్రమే వస్తుందని వినియోగంలో మార్పులేకున్నా గ్యాస్ త్వరగానే అయిపోతుందని ఈ విషయంలో అధికారులు కిందిస్థాయి వ్యక్తుల పనితీరును నెగ్గు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని పరిస్థితులు చెబుతున్నాయి. కొందరు డీలర్ల పనితీరు అధికారులకే సవాల్ విసురున్నట్లు ఉంది. ఇకనైనా డీలర్లు అధికారులు నిద్రలేచి ప్రజలకు వినియోగదారులకు గ్యాస్ డెలివరీ చేసే సమయంలో బరువు చూపించి ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు.





