కొండయ్యవలస గ్రామం నిర్వాసితుల ఆరాధ్య దేవత శ్రీ బంగారమ్మ తల్లి ఆలయ ప్రహరీ పనులను పరిశీలించిన ఆలయ కమిటీ సభ్యులు
గాజువాక శాసన సభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు , జీవీఎంసీ 85వ వార్డు కార్పొరేటర్ వరలక్ష్మి ప్రసాద్ మరియు కూటమి నాయకులు చేతుల మీదుగా సుమారు 20 లక్షల రూపాయలు నిధులుతో గత నెల జనవరి 31 వతేదీన శంకుస్థాపన చేయడం జరిగింది. కొందరు వ్యక్తులు ప్రహరీ నిర్మాణం ఆపేద్దాం అని ప్రయత్నం చేసినప్పటికి ఆలయ కమిటీ పెద్దలు అందరు కలిసి గాజువాక శాసనసభ్యులు శ్రీనివాసరావు దృష్టికి సమస్య తీసుకుని వెళ్లి అధికారులు తో మాట్లాడించి ప్రహరీ పనులు ప్రారంభం అయ్యేలా చొరవ తీసుకుని దగ్గర ఉండి పనులు ప్రారంభం అవడానికి కృషి చేసారు. ప్రారంభం అయిన పనులు బుధవారం ఉదయం గ్రామ పెద్దలు ఆలయ కమిటీ సభ్యులు పరిశీలించడం జరిగింది.
శ్రీ మరిడిమాంబ మరియు బంగారమ్మ ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీ బలిరెడ్డి శ్రీను అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లో ఏడీసి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ, వార్డు తెలుగుయువత అధ్యక్షులు బండారు చందు రమేష్, టిడిపి సీనియర్ నాయకులు పలక అచ్యుత్, వడ్డాది శ్రీనివాసరావు, జనసేన నాయకులు విందుల నాగేంద్ర, బైలపూడి విజయ్, విందుల కళ్యాణ్ ఆలయ కమిటీ సభ్యులు బుదిరెడ్డి కన్నారావు, పట్టా రామకృష్ణ, బలిరెడ్డి శేఖర్, పిల్లా శ్రీను తదితరులు పాల్గొన్నారు.



