Tuesday, 10 February 2026
  • Home  
  • ప్రజల ఆరోగ్యం మా ప్రాధాన్యం… ఇబ్రహీంపట్నం అభివృద్ధి మా బాధ్యత” – ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి
- E-పేపర్

ప్రజల ఆరోగ్యం మా ప్రాధాన్యం… ఇబ్రహీంపట్నం అభివృద్ధి మా బాధ్యత” – ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి

ప్రజల ఆరోగ్యం మా ప్రాధాన్యం… ఇబ్రహీంపట్నం అభివృద్ధి మా బాధ్యత” – ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పున్నమి న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ 10 ఫిబ్రవరి 2026 *ఇబ్రహీంపట్నం ప్రజలకు వరంగా 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి – పనులను స్వయంగా పర్యవేక్షించిన ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి* *“నిధుల కొరత ఉండదు… వేగంగా పూర్తి చేయండి” అధికారులకు స్పష్టమైన ఆదేశాలు – రంగన్న* *“ప్రజల ఆరోగ్యం మా ప్రాధాన్యం… ఇబ్రహీంపట్నం అభివృద్ధి మా బాధ్యత” – ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి* ఎలక్షన్స్ ప్రచారం ముగిసినావెంటనే ప్రజలకి ఇచ్చిన మాట ప్రకారం రూపురేకలు మారుస్తా అనీ ఇచ్చిన మాట కి కట్టుబడి మన పట్టణం లో జరుగుతున్న అభివృద్ధి పనుల పర్యవేక్షణ లో భాగంగా ఇబ్రహీంపట్నం ప్రజల ఆరోగ్య భద్రతకు కీలకంగా మారనున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి స్వయంగా పరిశీలించారు. నిర్మాణ ప్రాంగణాన్ని సందర్శించి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి భవనం నాణ్యత, వసతులు, వార్డులు, అత్యవసర విభాగం, ప్రసూతి కేంద్రం, ల్యాబ్ సౌకర్యాలు వంటి అంశాలపై ప్రత్యేకంగా సమీక్షించిన ఎమ్మెల్యే, “ఇది సాధారణ భవనం కాదు… ఇబ్రహీంపట్నం ప్రజల ప్రాణాలకు భరోసా ఇచ్చే ఆసుపత్రి” అని స్పష్టం చేశారు. నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని, అవసరమైతే అదనపు నిధులు కూడా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. పనులు ఆలస్యం కాకుండా వేగవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు, ఇంజినీర్లకు కఠినంగా ఆదేశించారు. నాణ్యత విషయంలో రాజీపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసుపత్రి పూర్తయితే ఇబ్రహీంపట్నం, పరిసర గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో నగరానికి వెళ్లాల్సిన అవసరం తగ్గనుంది. ప్రజల ఆరోగ్య సంక్షేమమే లక్ష్యంగా ఎమ్మెల్యే రంగారెడ్డి తీసుకుంటున్న చర్యలను స్థానికులు ప్రశంసిస్తున్నారు.

ప్రజల ఆరోగ్యం మా ప్రాధాన్యం… ఇబ్రహీంపట్నం అభివృద్ధి మా బాధ్యత” – ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి

పున్నమి న్యూస్ ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్
10 ఫిబ్రవరి 2026
*ఇబ్రహీంపట్నం ప్రజలకు వరంగా 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి – పనులను స్వయంగా పర్యవేక్షించిన ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి*

*“నిధుల కొరత ఉండదు… వేగంగా పూర్తి చేయండి” అధికారులకు స్పష్టమైన ఆదేశాలు – రంగన్న*

*“ప్రజల ఆరోగ్యం మా ప్రాధాన్యం… ఇబ్రహీంపట్నం అభివృద్ధి మా బాధ్యత” – ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి*

ఎలక్షన్స్ ప్రచారం ముగిసినావెంటనే ప్రజలకి ఇచ్చిన మాట ప్రకారం రూపురేకలు మారుస్తా అనీ ఇచ్చిన మాట కి కట్టుబడి మన పట్టణం లో జరుగుతున్న అభివృద్ధి పనుల పర్యవేక్షణ లో భాగంగా ఇబ్రహీంపట్నం ప్రజల ఆరోగ్య భద్రతకు కీలకంగా మారనున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి స్వయంగా పరిశీలించారు. నిర్మాణ ప్రాంగణాన్ని సందర్శించి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఆసుపత్రి భవనం నాణ్యత, వసతులు, వార్డులు, అత్యవసర విభాగం, ప్రసూతి కేంద్రం, ల్యాబ్ సౌకర్యాలు వంటి అంశాలపై ప్రత్యేకంగా సమీక్షించిన ఎమ్మెల్యే, “ఇది సాధారణ భవనం కాదు… ఇబ్రహీంపట్నం ప్రజల ప్రాణాలకు భరోసా ఇచ్చే ఆసుపత్రి” అని స్పష్టం చేశారు.
నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని, అవసరమైతే అదనపు నిధులు కూడా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. పనులు ఆలస్యం కాకుండా వేగవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు, ఇంజినీర్లకు కఠినంగా ఆదేశించారు. నాణ్యత విషయంలో రాజీపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆసుపత్రి పూర్తయితే ఇబ్రహీంపట్నం, పరిసర గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో నగరానికి వెళ్లాల్సిన అవసరం తగ్గనుంది. ప్రజల ఆరోగ్య సంక్షేమమే లక్ష్యంగా ఎమ్మెల్యే రంగారెడ్డి తీసుకుంటున్న చర్యలను స్థానికులు ప్రశంసిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.