* విశాఖపట్నం డిసెంబర్ 11 పున్నమి ప్రతినిధి * పోలీస్ కమీషనర్ శ్రీ. శంఖబ్రత బాగ్చి IPS గారి ఆదేశాలతో యాచకులకు ఆశ్రయం కల్పించే మిషన్ జ్యోతిర్గమయ కార్యక్రమంలో భాగంగా ఏయూటిడి మరియు పోలీసుల రెస్క్యూ టీం సంయుక్తంగా ఇద్దరు మహిళలతో పాటు మొత్తం 21 మందిని రెస్క్యూ చేశారు.
వారిలో మొదట భీంనగర్ షెల్టరుకు తరలించిన వారి పేర్లు ఎడమ నుంచి వరుసగా కృష్ణ (20) ఒడిశా, బాబు (45) బంగ్లాదేశ్, అనురాగ కపూర్ (30) ఒడిశా, సంజయ్ (60) ఒడిశా, బషీర్ (50) ముంబై, సుశాంత్ (36) బంగ్లాదేశ్, మంగులు (40) ఖరగ్ పూర్, రాము (45) శ్రీకాకుళం, సైలేష్ (30) మహారాష్ట్ర, లక్ష్మణరావు (50), ఊరు హైదరాబాద్. అలాగే టి.యస్.ఆర్ కాంప్లెక్స్ షెల్టరుకు తరలించిన వారిలో 9 మంది మానసిక రోగులు ఊరు పేరు ఏమి చెప్పడం లేదు, ఇద్దరు మహిళలు పేర్లు అల్లు నారాయణమ్మ (70), జగదాంబ జంక్షన్, ఇంకొకరు అంకిత (60), బిలాస్ పూర్. వీరందరికీ అన్ని సదుపాయాలతో ఆశ్రయం కల్పించారు.
ఈ రెస్క్యూలో కంట్రోల్ రూం ఎస్.ఐ ప్రసాద్, హెచ్.సి శ్రీనివాస్, కానిస్టేబుల్ ప్రతాప్ మరియు ఏయూటిడి నుంచి భాస్కరరావు, రాజేష్ పాల్గొన్నారు.


