గాజువాక, నవంబర్ (ప్రత్యేక ప్రతినిధి)
పేదవాడి సొంత ఇంటి కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, గాజువాక శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. బుధవారం గాజువాక జోనల్ కార్యాలయంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో గాజువాక నియోజకవర్గానికి ఎంపికైన లబ్ధిదారులకు 2.5 లక్షల విలువైన వర్క్ ప్రొసీడింగ్స్‌ను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పల్లా మాట్లాడుతూ —
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 వేల మంది లబ్ధిదారులు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో ఎంపికయ్యారని, అందులో విశాఖ జిల్లాకు 2,800 మంది, గాజువాక నియోజకవర్గానికి 1,343 మంది లబ్ధిదారులు ఎంపికయ్యారని తెలిపారు.
కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గాజువాక నియోజకవర్గ లబ్ధిదారుల గృహ నిర్మాణానికి సుమారు ₹335 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రతీ లబ్ధిదారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో ఏపీ హౌసింగ్ ఈఈ డి. సుబ్రహ్మణ్యం, ఏఈ గోపాలకృష్ణ, జోనల్ కమిషనర్ శేషాద్రి, డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రసాదుల శ్రీనివాస్, బీజేపీ ఇన్‌చార్జి కరణం రెడ్డి నర్సింగరావు, కార్పొరేటర్లు గంధం శ్రీనివాసరావు, బోండా జగన్, పల్లా శ్రీనివాస్, రౌతు శ్రీనివాస్, రాజాన రామారావు తదితరులు పాల్గొన్నారు.


