జిల్లా పశుసంవర్థక అధికారి డా. వి. జయరాజ

పశువులకు గాలి కుంటి వ్యాధి టీకా ఎంతో కీలకం అనిజిల్లా పశుసంవర్థక అధికారి డా. వి. జయరాజు అన్నారు.
సెప్టెంబర్ 19వ తేదీ శుక్రవారం అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలంలోని గీడిగపుట్టు, పతిమామిడి గ్రామాలలో గాలి కుంటి వ్యాధి (ఎఫ్ ఎం డి) టీకా కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ వి. జయరాజు ప్రత్యక్షంగా పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, పశువుల ఆరోగ్యం కాపాడటంలో ఎఫ్ ఎం డి టీకా ఎంతో కీలకమని, ప్రతి రైతు తన పశువులకు తప్పనిసరిగా ఈ టీకా వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. పశువులకు సమయానికి టీకాలు వేయడం వల్ల వ్యాధులు రాకుండా నిరోధించగలమని, అలాగే పశుసంవర్దక రంగంలో రైతులు నష్టాలను తప్పించుకోవచ్చని ఆయన వివరించారు.
డాక్టర్ వి. జయరాజు స్థానిక పశువైద్య సిబ్బందిని అభినందిస్తూ, ప్రతి గ్రామంలోనూ ఈ టీకా కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని సూచించారు. రైతులు కూడా సక్రమంగా స్పందించి తమ పశువులను టీకా కోసం తీసుకువచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు,
ఈ కార్యక్రమంలో పశువైద్య అధికారులు, సిబ్బంది, గ్రామస్థులు చురుకుగా పాల్గొన్నారు.

