సీతారామపురం కస్తూరిబా బాలికల విద్యాలయంలో పదో తరగతి విద్యార్థుల కోసం పరీక్షా కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కుర్రా రత్తయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గౌరవ ఉదయగిరి ఎమ్మెల్యే Kakarla Suresh పాల్గొని సుమారు 300 మంది విద్యార్థులకు పరీక్షా సామగ్రి కిట్లను అందజేశారు. పెన్నులు, పెన్సిళ్లు, స్కేలు, రబ్బరు, రైటింగ్ ప్యాడ్లతో కూడిన కిట్లు విద్యార్థులకు ఉపయుక్తంగా నిలిచాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యే భవిష్యత్తుకు భరోసా అని పేర్కొంటూ క్రమశిక్షణ, సమయపాలనతో చదివి మంచి ఫలితాలు సాధించాలని విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశం అందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.



