ఏర్పేడు, పున్నమి న్యూస్, మార్చి 05, ఏర్పేడు మండలంలోని పొంగూరు జిల్లా పరిషత్ హై స్కూల్‌కు శ్రీ పార్వతీ సమేత శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త గంగలపూడి గిరిధర్ రెడ్డి తన సొంత నిధులతో రూ.3,50,000 ఖర్చు చేసి సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్టాపనతో పాటు రేకుల షెడ్డుతో కూడిన శాశ్వత స్టేజ్‌ను నిర్మించి ఈ సేవా కార్యక్రమాన్ని తన తల్లిదండ్రులు కీర్తిశేషులు గంగలపూడి పుల్లారెడ్డి, సుందరమ్మ గార్ల జ్ఞాపకార్థంగా ప్రభుత్వ పాఠశాలకు అంకితం చేశారు. ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ…. పాఠశాల సందర్శనార్ధం విచ్చేసిన గంగలపూడి గిరిధర్ రెడ్డికి పాఠశాలకు వేదిక యొక్క అవసరాన్ని వివరించగా వెంటనే స్పందించిన శ్రీ పార్వతీ సమేత శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త స్టేజ్ నిర్మాణం తన సొంత నిధులతో చేస్తానని ముందుకొచ్చారని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సదుపాయాల కల్పనలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుని సుమారు రూ.3.50 లక్షల వ్యయంతో రేకుల షెడ్డుతో కూడిన పక్కా స్టేజ్ నిర్మాణాన్ని పూర్తి చేసి, పాఠశాల ప్రాంగణంలో సరస్వతి దేవి విగ్రహాన్ని ప్రతిష్టించారని ఆయన తెలిపారు. అనంతరం స్టేజ్‌ను విద్యార్థులకు అంకితం చేసీనా గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ….ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సరైన ప్రోత్సాహం ఇస్తే వారు జాతీయ స్థాయిలో రాష్ట్రానికి, దేశానికి గర్వకారణం అవుతారని వారికి అవసరమైన సదుపాయాలు కల్పించడం తన బాధ్యతగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ….ఇంతకుముందు ఎండలోనే కార్యక్రమాలు నిర్వహించాల్సి వచ్చేదని, ఇప్పుడు కొత్త స్టేజ్‌తో ప్రార్థనలు, సాంస్కృతిక కార్యక్రమాలు సౌకర్యంగా నిర్వహించుకోగలమని తెలిపారు. తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా ప్రభుత్వ పాఠశాలకు ఈ సదుపాయాలను అంకితం చేసిన శ్రీ పార్వతీ సమేత శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త గంగలపూడి గిరిధర్ రెడ్డి సేవా భావం అందరికీ ఆదర్శంగా నిలిచింది.

పంగురు జెడ్పీ హై స్కూల్‌కు గిరిధర్ రెడ్డి రూ.3.50 లక్షల విరాళం