1996 మార్చ్ 17-18 తేదీలలో నెల్లూరు వి ఆర్ కళాశాలలో రెండు రోజుల పాటు మల్లంపల్లి సోమశేఖర శర్మ సెంటర్ ఫర్ హిస్టారికల్ స్టడీస్ సంస్థ నిర్వహించిన నెల్లూరు జిల్లా స్వాతంత్ర్య సమర చరిత్ర అంశం మీద పలువురు ఆహ్వానిత అధ్యాపకులు చేసిన పత్రసమర్పణ
విషయాలు 30 ఏళ్ల తర్వాత గ్రంథ రూపంలో వెలుగులోకివచ్చి ఈ రోజు విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు ద్వారా ఆవిష్కరణ జరిగింది. యువతలో జాతీయ భావనలు పూర్తిగా కనుమరుగవుతున్న నేపథ్యంలో జిల్లా స్వాతంత్ర్య సమర చరిత్ర పుస్తకం ఆవిష్కరణ చేయడం ఒక మహద్భాగ్యం గా భావిస్తున్నట్లు వైస్ ఛాన్సలర్ చెప్పారు. నేటి తరం యువతకు స్వాతంత్ర్య పోరాటంలో త్యాగాలు చేసిన వారి గురించి విస్తృతంగా చర్చ జరగాలని వారు తెలుసుకోవాలని ఆకాంక్షించారు.
డాక్టర్ గిద్దలూరు వేంకటేశ్వర రావు, కాంజీవరం రాధాకృష్ణ అప్పట్లో సదస్సు నిర్వహించారు. ఆ సదస్సుకు హాజరైన డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి సలహా మేరకు ఈ సదస్సు వివరాలు గ్రంథ రూపంలో వస్తేనే విజయవంత మయ్యినట్లు అని చేసిన సూచన మేరకు ఇది 480 పేజి ల బృహత్ గ్రంథం అయింది. అనివార్య కారణాల రీత్యా ఆలస్యం అయినా భవిష్యత్ తరాలకు జిల్లా స్వాతంత్య్ర చరిత్ర తెలిసేలా వెలువరించమని కాంజీవరం రాధాకృష్ణ పుస్తక సమీక్ష లో వివరించారు. సుమారు 84 మంది రాసిన పలు అంశాల వ్యాసాలు ఇందులో ఉన్నాయని రాధాకృష్ణ అన్నారు. నెల్లూరు జిల్లా కు చెందిన కొందరు వదాన్యులు ఈ గ్రంథ ప్రచురణలకు సహకరించారని, వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
గ్రంథ సంపాదక బృందంలో ఒకరైన డాక్టర్ లెనిన్ ధనిశెట్టి ఈ పుస్తకం వెలువరించేందుకు ఇద్దరు అధ్యాపకులు పడిన శ్రమ ఫలించిందని అన్నారు. అనంతరం విచ్చేసిన గ్రంథంలోని వ్యాస రచయితలు బొగ్గవరపు రాధాకృష్ణ మూర్తి, డా గంగి శెట్టి శివకుమార్, రంగారావు, కార్యక్రమ సమన్వయ
కర్తలు డాక్టర్ పెరుగు రామకృష్ణ, డాక్టర్ లెనిన్లకు ఉపకులపతి గ్రంథ ప్రతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘమిత్ర విద్యా సంస్థల చైర్మన్ రవీంద్ర రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, గూడూరు పాలిటెక్నిక్ కళాశాల లెక్చరర్ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు..!

నెల్లూరు జిల్లా స్వాతంత్ర్య సమర చరిత్ర గ్రంథ ఆవిష్కరణ
1996 మార్చ్ 17-18 తేదీలలో నెల్లూరు వి ఆర్ కళాశాలలో రెండు రోజుల పాటు మల్లంపల్లి సోమశేఖర శర్మ సెంటర్ ఫర్ హిస్టారికల్ స్టడీస్ సంస్థ నిర్వహించిన నెల్లూరు జిల్లా స్వాతంత్ర్య సమర చరిత్ర అంశం మీద పలువురు ఆహ్వానిత అధ్యాపకులు చేసిన పత్రసమర్పణ విషయాలు 30 ఏళ్ల తర్వాత గ్రంథ రూపంలో వెలుగులోకివచ్చి ఈ రోజు విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు ద్వారా ఆవిష్కరణ జరిగింది. యువతలో జాతీయ భావనలు పూర్తిగా కనుమరుగవుతున్న నేపథ్యంలో జిల్లా స్వాతంత్ర్య సమర చరిత్ర పుస్తకం ఆవిష్కరణ చేయడం ఒక మహద్భాగ్యం గా భావిస్తున్నట్లు వైస్ ఛాన్సలర్ చెప్పారు. నేటి తరం యువతకు స్వాతంత్ర్య పోరాటంలో త్యాగాలు చేసిన వారి గురించి విస్తృతంగా చర్చ జరగాలని వారు తెలుసుకోవాలని ఆకాంక్షించారు. డాక్టర్ గిద్దలూరు వేంకటేశ్వర రావు, కాంజీవరం రాధాకృష్ణ అప్పట్లో సదస్సు నిర్వహించారు. ఆ సదస్సుకు హాజరైన డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి సలహా మేరకు ఈ సదస్సు వివరాలు గ్రంథ రూపంలో వస్తేనే విజయవంత మయ్యినట్లు అని చేసిన సూచన మేరకు ఇది 480 పేజి ల బృహత్ గ్రంథం అయింది. అనివార్య కారణాల రీత్యా ఆలస్యం అయినా భవిష్యత్ తరాలకు జిల్లా స్వాతంత్య్ర చరిత్ర తెలిసేలా వెలువరించమని కాంజీవరం రాధాకృష్ణ పుస్తక సమీక్ష లో వివరించారు. సుమారు 84 మంది రాసిన పలు అంశాల వ్యాసాలు ఇందులో ఉన్నాయని రాధాకృష్ణ అన్నారు. నెల్లూరు జిల్లా కు చెందిన కొందరు వదాన్యులు ఈ గ్రంథ ప్రచురణలకు సహకరించారని, వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. గ్రంథ సంపాదక బృందంలో ఒకరైన డాక్టర్ లెనిన్ ధనిశెట్టి ఈ పుస్తకం వెలువరించేందుకు ఇద్దరు అధ్యాపకులు పడిన శ్రమ ఫలించిందని అన్నారు. అనంతరం విచ్చేసిన గ్రంథంలోని వ్యాస రచయితలు బొగ్గవరపు రాధాకృష్ణ మూర్తి, డా గంగి శెట్టి శివకుమార్, రంగారావు, కార్యక్రమ సమన్వయ కర్తలు డాక్టర్ పెరుగు రామకృష్ణ, డాక్టర్ లెనిన్లకు ఉపకులపతి గ్రంథ ప్రతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘమిత్ర విద్యా సంస్థల చైర్మన్ రవీంద్ర రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, గూడూరు పాలిటెక్నిక్ కళాశాల లెక్చరర్ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు..!

