Tuesday, 24 March 2026
  • Home  
  • నిరుపేదరాలు షకీలమ్మకు అపన్న హస్తం అందించిన భోళా శంకర్ సేవా సమితి*
- E-పేపర్

నిరుపేదరాలు షకీలమ్మకు అపన్న హస్తం అందించిన భోళా శంకర్ సేవా సమితి*

*నిరుపేదరాలు షకీలమ్మకు అపన్న హస్తం అందించిన భోళా శంకర్ సేవా సమితి రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణంలోని పగడాల పల్లి లో నివసిస్తున్న నిరుపేద వృద్ధురాలు షకీలమ్మకు శుక్రవారం భోళా శంకర్ సేవా సమితి అధ్యక్షులు మందల నాగేంద్ర ఆధ్వర్యంలో కీర్తిశేషులు దాసరి సోమయ్య వర్ధంతి పురస్కరించుకొని వారి కుమారులు సునీల్ కుమార్, మణికంఠ మరియు అల్లుడు మాదా నవీన్ కుమార్ దాతృత్వంతో నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. మొదటగా పగడాలపల్లిలోని రామాలయంలో పూజలు నిర్వహించి అనంతరం నిరుపేదరాలైన షకీలమ్మకు బియ్యం మరియు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. తన కష్టాలను గుర్తించి చేయూతనందించిన భోళా శంకర్ సేవాసమితి వారికి మరియు నిత్యవసర సరుకులు పంపిణీ చేసి దాతృత్వం చాటుకున్న దాసరి సునీల్ కుమార్ , మణికంఠ లకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మందల నాగేంద్ర మాట్లాడుతూ మన సేవా సమితి ప్రారంభించిన నాటి నుండి ఈరోజు వరకు నిత్యం శివ పరమాత్మ ని దయవల్ల నిరుపేద కుటుంబీకులకు సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే శుక్రవారం షకీలమ్మకు మన భోళా శంకర్ సేవా సమితి ఆధ్వర్యంలో కీర్తిశేషులు దాసరి సోమయ్య వర్ధంతి పురస్కరించుకొని ఆయన కుమారులు సునీల్, మణికంఠ అల్లుడు మాద నవీన్ కుమార్ ఆ నిరుపేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ పరమాత్ముని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని ఆయన అన్నారు. త్వరలోనే మన సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టిన అయ్యప్ప స్వామి భక్తులకు భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భోళా శంకర్ సేవా సమితి సభ్యులు చెన్నం శెట్టి రమేష్, రాజేశ్వరమ్మ, వాసా బాబు, బూమ్పల్లి నాగరాజు, మల్లెం మణి, చింతకాయల నరసింహులు, మహంకాళి సుబ్రహ్మణ్యం, పెనుగొండ సుబ్బరాయుడు, కొర్లకుంట శంకరయ్య, నార్జాల కుమార్ పాల్గొన్నారు.

*నిరుపేదరాలు షకీలమ్మకు అపన్న హస్తం అందించిన భోళా శంకర్ సేవా సమితి

రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణంలోని పగడాల పల్లి లో నివసిస్తున్న నిరుపేద వృద్ధురాలు షకీలమ్మకు శుక్రవారం భోళా శంకర్ సేవా సమితి అధ్యక్షులు మందల నాగేంద్ర ఆధ్వర్యంలో కీర్తిశేషులు దాసరి సోమయ్య వర్ధంతి పురస్కరించుకొని వారి కుమారులు సునీల్ కుమార్, మణికంఠ మరియు అల్లుడు మాదా నవీన్ కుమార్ దాతృత్వంతో నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. మొదటగా పగడాలపల్లిలోని రామాలయంలో పూజలు నిర్వహించి అనంతరం నిరుపేదరాలైన షకీలమ్మకు బియ్యం మరియు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. తన కష్టాలను గుర్తించి చేయూతనందించిన భోళా శంకర్ సేవాసమితి వారికి మరియు నిత్యవసర సరుకులు పంపిణీ చేసి దాతృత్వం చాటుకున్న దాసరి సునీల్ కుమార్ , మణికంఠ లకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మందల నాగేంద్ర మాట్లాడుతూ మన సేవా సమితి ప్రారంభించిన నాటి నుండి ఈరోజు వరకు నిత్యం శివ పరమాత్మ ని దయవల్ల నిరుపేద కుటుంబీకులకు సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే శుక్రవారం షకీలమ్మకు మన భోళా శంకర్ సేవా సమితి ఆధ్వర్యంలో కీర్తిశేషులు దాసరి సోమయ్య వర్ధంతి పురస్కరించుకొని ఆయన కుమారులు సునీల్, మణికంఠ అల్లుడు మాద నవీన్ కుమార్ ఆ నిరుపేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ పరమాత్ముని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని ఆయన అన్నారు. త్వరలోనే మన సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టిన అయ్యప్ప స్వామి భక్తులకు భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భోళా శంకర్ సేవా సమితి సభ్యులు చెన్నం శెట్టి రమేష్, రాజేశ్వరమ్మ, వాసా బాబు, బూమ్పల్లి నాగరాజు, మల్లెం మణి, చింతకాయల నరసింహులు, మహంకాళి సుబ్రహ్మణ్యం, పెనుగొండ సుబ్బరాయుడు, కొర్లకుంట శంకరయ్య, నార్జాల కుమార్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.