Thursday, 12 February 2026
  • Home  
  • నల్గొండలో శిశు మరణాలు, సిజేరియన్లను తగ్గించాలని ఆదేశించిన :జిల్లా కలెక్టర్
- తెలంగాణ

నల్గొండలో శిశు మరణాలు, సిజేరియన్లను తగ్గించాలని ఆదేశించిన :జిల్లా కలెక్టర్

నకిరేకల్ :సెప్టెంబర్ ( పున్నమి ప్రతినిధి ) నల్గొండ జిల్లాలో శిశు మరణాలు, సిజేరియన్ శస్త్రచికిత్సల సంఖ్యను తగ్గించాల్సిన అవసరం ఉందని జిల్లాకలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు.గురువారం ఉదయాదిత్య భవనంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆమె, గర్భిణీ స్త్రీలకు పిహెచ్ సి స్థాయిలో 3 ఎ ఎన్ సి పరీక్షలు ఖచ్చితంగా నిర్వహించాలని సూచించారు. అవసరమైతే వెంటనే గైనకాలజిస్ట్ కి రిఫర్ చేయాలని, తక్కువ బరువుతో పిల్లలు పుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రసవం తర్వాత శిశువుకి తల్లిపాలు ఇవ్వడం,సంవత్సరం వరకు పాటించాల్సిన జాగ్రత్తలపై అంగన్వాడీ,ఆశా కార్యకర్తలు గ్రామాల్లో అవగాహన కల్పించాలని ఆమె ఆదేశించారు. కుటుంబ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రిలో సిజేరియన్ల సంఖ్యను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డి సి హెచ్ఎస్ డాక్టర్ మాతృనాయక్, ఇతర అధికారులు హాజరయ్యారు.

నకిరేకల్ :సెప్టెంబర్ ( పున్నమి ప్రతినిధి )
నల్గొండ జిల్లాలో శిశు మరణాలు, సిజేరియన్ శస్త్రచికిత్సల సంఖ్యను తగ్గించాల్సిన అవసరం ఉందని జిల్లాకలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు.గురువారం ఉదయాదిత్య భవనంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆమె, గర్భిణీ స్త్రీలకు పిహెచ్ సి స్థాయిలో 3 ఎ ఎన్ సి పరీక్షలు ఖచ్చితంగా నిర్వహించాలని సూచించారు. అవసరమైతే వెంటనే గైనకాలజిస్ట్ కి రిఫర్ చేయాలని, తక్కువ బరువుతో పిల్లలు పుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
ప్రసవం తర్వాత శిశువుకి తల్లిపాలు ఇవ్వడం,సంవత్సరం వరకు పాటించాల్సిన జాగ్రత్తలపై అంగన్వాడీ,ఆశా కార్యకర్తలు గ్రామాల్లో అవగాహన కల్పించాలని ఆమె ఆదేశించారు. కుటుంబ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రిలో సిజేరియన్ల సంఖ్యను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డి సి హెచ్ఎస్ డాక్టర్ మాతృనాయక్, ఇతర అధికారులు హాజరయ్యారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.