Date
12-4-2026
ఉస్మాన్ (పున్నమి నందిపాడు రిపోర్టర్ )
నందిపాడు: స్థానిక నందిపాడు సెంటర్‌లో రోడ్డు భద్రత, హెల్మెట్ వినియోగం మరియు గంజాయి నివారణపై అవగాహన కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉదయగిరి సీఐ వెంకటరావు గారు, దుత్తలూరు ఎస్‌ఐ ఆదిలక్ష్మి గారు హాజరై ప్రజలకు ముఖ్య సూచనలు చేశారు.
ఈ సందర్భంగా సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఇది ప్రాణ రక్షణకు ఎంతో కీలకమని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో గాయాలు, మరణాలు తగ్గించడానికి హెల్మెట్ వినియోగం చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కూడా పోలీసులు ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో సురక్షిత డ్రైవింగ్‌పై చైతన్యం కల్పిస్తున్నారు
దుత్తలూరు ఎస్‌ఐ ఆదిలక్ష్మి గారు మాట్లాడుతూ, గంజాయి వంటి మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని హెచ్చరించారు. గంజాయి వినియోగం మరియు రవాణా చట్టపరంగా నేరమని, దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పోలీసులు రోడ్డు పక్కన వాహనదారులను ఆపి హెల్మెట్ ప్రాముఖ్యతపై వివరించారు. స్థానిక ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోలీసుల సూచనలను శ్రద్ధగా విన్నారు.
ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు రోడ్డు నియమాలను పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.



