Wednesday, 25 March 2026
  • Home  
  • దీపావళి కి ప్రభుత్వ ఉద్యోగుల కి తీపి కబురు
- ఆంధ్రప్రదేశ్

దీపావళి కి ప్రభుత్వ ఉద్యోగుల కి తీపి కబురు

పున్నమి ప్రతి నిధి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు ప్రకటించారు. రాష్ట్ర ఉద్యోగులకు ఒక డీఏ (మహంగాయితీ భత్యం) పెంచుతూ నవంబర్ 1వ తేదీ నుంచి అమలు చేయనున్నట్టు వెల్లడించారు. దీనికి రూ.160 కోట్ల వ్యయం ఉంటుందని తెలిపారు. పోలీసు సిబ్బందికి సరెండర్ లీవ్‌లో ఒక ఇంస్టాల్‌మెంట్‌ను క్లియర్ చేస్తామని, దీన్ని రెండు విడతల్లో చెల్లింపులు చేస్తామని సీఎం తెలిపారు. ఇందుకు రూ.210 కోట్ల వ్యయం అవుతుందని పేర్కొన్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసం 60 రోజుల్లోగా అన్ని సంఘాలతో చర్చించి హెల్త్ కార్డులను పూర్తిగా స్ట్రీమ్‌లైన్ చేస్తామని హామీ ఇచ్చారు. మహిళా ఉద్యోగుల కోసం 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్స్‌ను రిటైర్మెంట్ వరకు వినియోగించుకునే అవకాశం కల్పిస్తూ వయోపరిమితి తొలగించారు. ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లు క్లియర్ చేస్తామని తెలిపారు. ఉద్యోగ సంఘాలకు చెందిన భవనాలపై ఉన్న ప్రాపర్టీ టాక్స్‌ను మాఫీ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అదనంగా, ఉద్యోగుల గౌరవాన్ని పెంచే విధంగా రీ-డిజిగ్నేషన్ ప్రక్రియను చేపడతామని హామీ ఇచ్చారు. ఈ నిర్ణయాలు ఉద్యోగుల్లో ఆనందం నింపాయి.

పున్నమి ప్రతి నిధి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు ప్రకటించారు. రాష్ట్ర ఉద్యోగులకు ఒక డీఏ (మహంగాయితీ భత్యం) పెంచుతూ నవంబర్ 1వ తేదీ నుంచి అమలు చేయనున్నట్టు వెల్లడించారు. దీనికి రూ.160 కోట్ల వ్యయం ఉంటుందని తెలిపారు. పోలీసు సిబ్బందికి సరెండర్ లీవ్‌లో ఒక ఇంస్టాల్‌మెంట్‌ను క్లియర్ చేస్తామని, దీన్ని రెండు విడతల్లో చెల్లింపులు చేస్తామని సీఎం తెలిపారు. ఇందుకు రూ.210 కోట్ల వ్యయం అవుతుందని పేర్కొన్నారు.

ఉద్యోగుల సంక్షేమం కోసం 60 రోజుల్లోగా అన్ని సంఘాలతో చర్చించి హెల్త్ కార్డులను పూర్తిగా స్ట్రీమ్‌లైన్ చేస్తామని హామీ ఇచ్చారు. మహిళా ఉద్యోగుల కోసం 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్స్‌ను రిటైర్మెంట్ వరకు వినియోగించుకునే అవకాశం కల్పిస్తూ వయోపరిమితి తొలగించారు. ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లు క్లియర్ చేస్తామని తెలిపారు.

ఉద్యోగ సంఘాలకు చెందిన భవనాలపై ఉన్న ప్రాపర్టీ టాక్స్‌ను మాఫీ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అదనంగా, ఉద్యోగుల గౌరవాన్ని పెంచే విధంగా రీ-డిజిగ్నేషన్ ప్రక్రియను చేపడతామని హామీ ఇచ్చారు. ఈ నిర్ణయాలు ఉద్యోగుల్లో ఆనందం నింపాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.