తుఫాను దృష్ట్యా సోమవారం జివిఎంసి లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)కార్యక్రమం రద్దు .
విశాఖపట్నం
-జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్.
విశాఖపట్నం, అక్టోబర్ పున్నమి ప్రతినిధి : తుఫాను దృష్ట్యా మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో, అన్ని జోనల్ కార్యాలయాల్లో అక్టోబర్ 27వ తేదీన అనగా సోమవారం నిర్వహించవలసిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( Public Grievance Redressal system-PGRS ) కార్యక్రమమును రద్దు చేయడమైనదని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదివారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. కావున విశాఖ నగర ప్రజలు పి జి ఆర్ ఎస్ కార్యక్రమం రద్దు చేసిన విషయాన్ని గమనించవలసిందిగా పత్రికా ప్రకటన ద్వారా కమిషనర్ ప్రజలకు తెలిపారు.


