మానవ హక్కుల సంఘం పేరుతో బెదిరింపులకు
పాల్పడ్డ నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి పడమర సీఐ మురళీమోహన్, ఎస్ఐ హరీషా వివరాల మేరకు.. ‘వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన అన్నపురెడ్డి రాణి, వేంపల్లికి చెందిన నాగేంద్ర, వీరపనాయునిపల్లెకి చెందిన శేఖర్, కృష్ణారెడ్డి ఆదివారం తిరుపతి లోని రమాదేవి హాస్పిటల్కు వెళ్లారు. తమను తాము మానవహక్కుల సంఘం ఎండీపీఎస్ ప్రతినిధులు, న్యాయవాదిగా పరిచయం చేసుకున్నారు. ఆస్పత్రిలో అధికంగా డబ్బు వసూలు చేస్తున్నారని.. ఆరోగ్యశ్రీ సేవలు సక్రమంగా అందించడం లేదనే ఫిర్యాదులపై మూడు రోజు లుగా రోగుల అభిప్రాయాలు తీసుకున్నామన్నారు. సంబంధిత వీడియోలు ఉన్నాయని.. రూ. 20 లక్షలు ఇవ్వకుంటే సామాజిక మాధ్యమాలలో వైరల్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. ఘటనపై హాస్పిటల్ ఎంఎస్ డాక్టర్ కిషోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నింది – తులను విచారిస్తున్న’ట్లు తెలిపారు.





