*డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయాలకు రూ.6 కోట్లు..!*
*రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క క్యాంపు కార్యాలయాల కోసం ప్రభుత్వం నిధులు కేటాయించింది.*
*ఖమ్మంలో కొత్తది, మధిరలోని క్యాంపు కార్యాలయంలో మరమ్మతులకు అవసరమైన రూ.6 కోట్లకు పరిపాలనా అనుమతులు విడివిడిగా మంజూరు చేసింది.*
*ఖమ్మంలోని ఎన్నెస్పీ క్వార్టర్స్ లైన్లో ఇప్పటికే ఉన్న క్యాంపు కార్యాలయం స్థలంలో కొత్తది నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.4.50 కోట్లకు అనుమతి వచ్చింది. అలాగే భట్టి సొంత నియోజకవర్గమైన మధిరలోని క్యాంపు కార్యాలయంలో మరమ్మతుల కోసం రూ.1.50కోట్ల నిధులకు కూడా పాలనా అనుమతినిచ్చారు*



