*పున్నమిప్రతినిధిగుడివాడ ప్రతినిధి.సెప్టెంబర్.26*
గుడివాడ పట్టణంలో ప్రసిద్ధిగాంచిన బంటుమిల్లి రోడ్డు లోని శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ గాయత్రీ దేవి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారికి వేద పండితులు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
ఉత్సవాల ఐదో రోజు శుక్రవారం శ్రీ గజలక్ష్మి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని దేవస్థానం ఈఓ కందుల గోపాలరావు, ఉత్సవ కమిటీ అధ్యక్షులు పట్టపు చిన్నా తెలియజేశారు. 26వ తేదీ శుక్రవారం దేవస్థాన ప్రాంగణంలో శ్రీ చండీ హోమ పూజలు నిర్వహిస్తున్నట్లు ఈవో గోపాలరావు తెలియచేశారు.


