సెప్టెంబర్ 30 (పున్నమి ప్రతినిధి)
కేంద్ర ప్రభుత్వం PM E-Drive స్కీం కింద రూ.2000 కోట్లతో దేశవ్యాప్తంగా 72,300 పబ్లిక్ EV ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు గైడ్లైన్స్ విడుదల చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు, విద్యా సంస్థల్లో ఏర్పాటు చేసే ఛార్జింగ్ స్టేషన్లకు 100% సబ్సిడీ, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్టులు, బస్ డిపోలు, టోల్ ప్లాజాలు వంటి ఇతర ప్రజా ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే 80% సబ్సిడీ అందించనుంది. ప్రభుత్వ సంస్థలు, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ ఈ ప్రాజెక్టుల కోసం తమ ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ గైడ్లైన్స్ ద్వారా గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడం, EV వాహనాల వాడకాన్ని వేగవంతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.


