నమస్కారం! నేను కోడెపాక, జితేందర్ , పున్నమి
రిపోటర్
వరంగల్ లోని కాశీబుగ్గ లోని ఇందిరానగర్ లో మెన్ రోడ్
చిన్న వర్షం పడినా నగరంలోని రోడ్లపై నీరు నిలిచి పోయి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి.
ప్రతి సారి వర్షం పడినప్పుడు ఇదే పరిస్థితి. డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో నీరు పారక రోడ్లపై పెద్ద ఎత్తున నిలిచి పోతోంది.
దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రజలు మున్సిపల్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
“చిన్న వర్షానికే ఇంత స్థాయి నీటిమునిగిపోతే, పెద్ద వర్షం పడితే పరిస్థితి ఏంటి?” అని వారు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని రోడ్లపై నీరు నిలవకుండా శాశ్వత పరిష్కారం తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.


