మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2026 – 27 ఆర్థిక సంవత్సర ప్రణాళికలో భాగంగా చిట్వేలి మండలంలోని అన్ని గ్రామపంచాయతీలలో మొదటి గ్రామసభలను అక్టోబర్ 3న నిర్వహించనున్నట్లు ఏపీవో నాగరాజ్ తెలిపారు.
సర్పంచ్ అధ్యక్షతన, పంచాయతీ సెక్రటరీ మరియు ఫీల్డ్ అసిస్టెంట్ ఆధ్వర్యంలో జరిగే ఈ గ్రామసభల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధి శ్రామికులు, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొనాలని ఆయన కోరారు.
మొత్తం 21 గ్రామపంచాయతీలలో రెండు టీములుగా విభజించి గ్రామసభలు నిర్వహించనున్నట్లు ఏపీవో పేర్కొన్నారు. ఈ సమావేశాల ద్వారా రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి పనుల ప్రణాళికను సిద్ధం చేసి, ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టేలా చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు.

చిట్వేలి మండలంలో గ్రామసభల ప్రారంభం – ప్రజలే ప్రణాళికల శిల్పులు
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2026 – 27 ఆర్థిక సంవత్సర ప్రణాళికలో భాగంగా చిట్వేలి మండలంలోని అన్ని గ్రామపంచాయతీలలో మొదటి గ్రామసభలను అక్టోబర్ 3న నిర్వహించనున్నట్లు ఏపీవో నాగరాజ్ తెలిపారు. సర్పంచ్ అధ్యక్షతన, పంచాయతీ సెక్రటరీ మరియు ఫీల్డ్ అసిస్టెంట్ ఆధ్వర్యంలో జరిగే ఈ గ్రామసభల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధి శ్రామికులు, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొనాలని ఆయన కోరారు. మొత్తం 21 గ్రామపంచాయతీలలో రెండు టీములుగా విభజించి గ్రామసభలు నిర్వహించనున్నట్లు ఏపీవో పేర్కొన్నారు. ఈ సమావేశాల ద్వారా రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి పనుల ప్రణాళికను సిద్ధం చేసి, ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టేలా చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు.

