Tuesday, 24 March 2026
  • Home  
  • గోవాడ సుగర్స్ రైతులు, కార్మికులను నమ్మించి నట్టేట ముంచిన కూటమి సర్కారు …. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్
- విశాఖపట్నం

గోవాడ సుగర్స్ రైతులు, కార్మికులను నమ్మించి నట్టేట ముంచిన కూటమి సర్కారు …. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్

గోవాడ సుగర్స్ రైతులు, కార్మికులను నమ్మించి నట్టేట ముంచిన కూటమి సర్కారు …. – క్రషింగ్ పై చేతులెత్తేసిన పాలకులు … ఫ్యాక్టరీని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు – గోవాడ సుగర్స్ పరిరక్షణకు కార్యాచరణ … – మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ … చోడవరం : అక్టోబర్ 26, సహకార రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నడుస్తున్న ది.చోడవరం కో ఆపరేటివ్ (గోవాడ) సుగర్స్ ను అగ్రప్రధాన నడుపుతామంటూ రైతాంగాన్ని, కార్మికులను నమ్మించిన కూటమి ప్రభుత్వం నట్టేట ముంచిందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ అన్నారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి గుడివాడ మాట్లాడుతూ ఈ ఏడాది చెరకు గానుగాట జరపలేమంటూ చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం కర్షకులు, కార్మికుల బకాయిలపై స్పష్టత ఇవ్వలేదన్నారు. సుమారు 60 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన గోవాడ చక్కెర కర్మాగారాన్ని అగ్రగామిగా నిలిపిన చెరకు రైతు బతుకు…. నేడు అధికారులు, పాలకుల దుశ్చర్యలతో చేదెక్కిందన్నారు. కర్షకులు, కార్మికులకు సుమారు 35 కోట్లు రూపాయలు బకాయిలు తక్షణమే చెల్లించాలన్నారు. చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో గోవాడ సుగర్స్ పరిధిలో లక్షలాది కార్మిక, కర్షక కుటుంబాలను కూటమి సర్కార్ మోసం చేసిందన్నారు. బకాయిలు చెల్లించని కూటమి పాలకులు చర్యలతో చెరుకు రైతులు, కార్మికుల బతుకులు మరింత భారం అయ్యయని ఆవేదన చెందుతున్నారు. అనకాపల్లి ఎంపీ, జిల్లా ఇన్చార్జి మంత్రి కొల్లు రవీంద్ర, మాడుగుల, చోడవరం ఎమ్మెల్యేలు కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, బండారు లు షుగర్ ఫ్యాక్టరీకు పూర్వవైభవం తీసుకువచ్చి లాభాల బాట తీసుకొస్తామని, హామీలు ఇచ్చి, నేడు గోవాడ సుగర్స్ ను మరింత అధోగతి పాలు చేసారన్నారు. గోవాడ సుగర్స్ పరిరక్షణకు ఆఖ అఖిలపక్ష నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. 2019-24 లో తమ ప్రభుత్వ హయాంలో గోవాడ సుగర్స్ కార్మికులు, కర్షకులను ఆదుకునేందుకు రూ. 89 కోట్లు గ్రాంట్ గా చెల్లించినట్లు గుర్తు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పాలన పై ఒంటెద్దు పోకడలా వుందన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రస్తుతం జరుగుతున్న పి.పి.పి మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా రాష్ట్రంలో ప్రతి చోట శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి, సంబంధిత అధికారులకు …. జరుగుతున్న అన్యాయాలపై, ప్రస్తుత వాతావరణ ప్రతికూలతల దృష్ట్యా వినతిపత్రాన్ని ఈ నెల 28న అందజేసేందుకు తీర్మానించారు. ఈ కార్యక్రమంలో ఎం.పీ.పీ గాడి కాశమ్మ, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఏడువాక సత్యారావు, సీనియర్ నాయకులు వెంపలి ఆనంద్, పినబోయిన అప్పారావు యదవ్, వైఎస్ఆర్సిపి టౌన్ అధ్యక్షులు దేవరపల్లి వీర వెంకట సత్యనారాయణ (సత్య), జిల్లా యూత్ ప్రెసిడెంట్ పుల్లేటి వెంకటేష్, మండల యూత్ ప్రెసిడెంట్ పల్లా ధనాజీ, పల్లా నర్సింగరావు, బొడ్డేటి సూర్యనారాయణ, టౌన్ యూత్ ప్రెసిడెంట్ గూనూరు రాజు, మాజీ శివాలయం చైర్మన్ సత్యనారాయణ గునూరు, జంగం కార్పొరేషన్ డైరెక్టర్ అత్తిలి జగన్, బొడ్డు శ్రీరామమూర్తి, చిటికెల నాగేష్ వార్డ్ నెంబర్, దండిన వెంకట్రావు గారు మాజీ కోపరేటివ్ సొసైటీ చైర్మన్, వర్జుల ప్రకాష్ రావు, అన్నపూర్ణ, వైఎస్సార్సీపీ మహిళా అధ్యక్షురాలు అల్లాడ భవాని, బొగ్గు శ్యామలమ్మ, బొగ్గు చందు, సూర్య ప్రకాష్ ఎస్ పేట, కోటి వార్డు, సిహెచ్ బాబురావు, బొంతు రామకృష్ణ, అప్పారావు, నరసింహమూర్తి, ఓరుగంటి నెహ్రూ, గూనూరు రామచంద్ర నాయుడు, మూడెడ్ల శంకర్రావు, నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

గోవాడ సుగర్స్ రైతులు, కార్మికులను నమ్మించి నట్టేట ముంచిన కూటమి సర్కారు …. – క్రషింగ్ పై చేతులెత్తేసిన పాలకులు … ఫ్యాక్టరీని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు – గోవాడ సుగర్స్ పరిరక్షణకు కార్యాచరణ … – మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ … చోడవరం : అక్టోబర్ 26, సహకార రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నడుస్తున్న ది.చోడవరం కో ఆపరేటివ్ (గోవాడ) సుగర్స్ ను అగ్రప్రధాన నడుపుతామంటూ రైతాంగాన్ని, కార్మికులను నమ్మించిన కూటమి ప్రభుత్వం నట్టేట ముంచిందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ అన్నారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి గుడివాడ మాట్లాడుతూ ఈ ఏడాది చెరకు గానుగాట జరపలేమంటూ చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం కర్షకులు, కార్మికుల బకాయిలపై స్పష్టత ఇవ్వలేదన్నారు. సుమారు 60 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన గోవాడ చక్కెర కర్మాగారాన్ని అగ్రగామిగా నిలిపిన చెరకు రైతు బతుకు…. నేడు అధికారులు, పాలకుల దుశ్చర్యలతో చేదెక్కిందన్నారు. కర్షకులు,
కార్మికులకు సుమారు 35 కోట్లు రూపాయలు బకాయిలు తక్షణమే చెల్లించాలన్నారు. చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో గోవాడ సుగర్స్ పరిధిలో లక్షలాది కార్మిక, కర్షక కుటుంబాలను కూటమి సర్కార్ మోసం చేసిందన్నారు. బకాయిలు చెల్లించని కూటమి పాలకులు చర్యలతో చెరుకు రైతులు, కార్మికుల బతుకులు మరింత భారం అయ్యయని ఆవేదన చెందుతున్నారు. అనకాపల్లి ఎంపీ, జిల్లా ఇన్చార్జి మంత్రి కొల్లు రవీంద్ర, మాడుగుల, చోడవరం ఎమ్మెల్యేలు కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, బండారు లు షుగర్ ఫ్యాక్టరీకు పూర్వవైభవం తీసుకువచ్చి లాభాల బాట తీసుకొస్తామని, హామీలు ఇచ్చి, నేడు గోవాడ సుగర్స్ ను మరింత అధోగతి పాలు చేసారన్నారు. గోవాడ సుగర్స్ పరిరక్షణకు ఆఖ అఖిలపక్ష నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. 2019-24 లో తమ ప్రభుత్వ హయాంలో గోవాడ సుగర్స్ కార్మికులు, కర్షకులను ఆదుకునేందుకు రూ. 89 కోట్లు గ్రాంట్ గా చెల్లించినట్లు గుర్తు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పాలన పై ఒంటెద్దు పోకడలా వుందన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రస్తుతం జరుగుతున్న పి.పి.పి మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా రాష్ట్రంలో ప్రతి చోట శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి, సంబంధిత అధికారులకు …. జరుగుతున్న అన్యాయాలపై, ప్రస్తుత వాతావరణ ప్రతికూలతల దృష్ట్యా వినతిపత్రాన్ని ఈ నెల 28న అందజేసేందుకు తీర్మానించారు. ఈ కార్యక్రమంలో ఎం.పీ.పీ గాడి కాశమ్మ, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఏడువాక సత్యారావు, సీనియర్ నాయకులు వెంపలి ఆనంద్, పినబోయిన అప్పారావు యదవ్, వైఎస్ఆర్సిపి టౌన్ అధ్యక్షులు దేవరపల్లి వీర వెంకట సత్యనారాయణ (సత్య), జిల్లా యూత్ ప్రెసిడెంట్ పుల్లేటి వెంకటేష్, మండల యూత్ ప్రెసిడెంట్ పల్లా ధనాజీ, పల్లా నర్సింగరావు, బొడ్డేటి సూర్యనారాయణ, టౌన్ యూత్ ప్రెసిడెంట్ గూనూరు రాజు, మాజీ శివాలయం చైర్మన్ సత్యనారాయణ గునూరు, జంగం కార్పొరేషన్ డైరెక్టర్ అత్తిలి జగన్, బొడ్డు శ్రీరామమూర్తి, చిటికెల నాగేష్ వార్డ్ నెంబర్, దండిన వెంకట్రావు గారు మాజీ కోపరేటివ్ సొసైటీ చైర్మన్, వర్జుల ప్రకాష్ రావు, అన్నపూర్ణ, వైఎస్సార్సీపీ మహిళా అధ్యక్షురాలు అల్లాడ భవాని, బొగ్గు శ్యామలమ్మ, బొగ్గు చందు, సూర్య ప్రకాష్ ఎస్ పేట, కోటి వార్డు, సిహెచ్ బాబురావు, బొంతు రామకృష్ణ, అప్పారావు, నరసింహమూర్తి, ఓరుగంటి నెహ్రూ, గూనూరు రామచంద్ర నాయుడు, మూడెడ్ల శంకర్రావు, నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.