Tuesday, 9 December 2025
  • Home  
  • గుమ్మిరేవులలో వైసీపీ నూతన పంచాయితీ కమిటీల ఎన్నిక,ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ‘కోటి సంతకాల సేకరణ’
- అల్లూరి సీతారామరాజు

గుమ్మిరేవులలో వైసీపీ నూతన పంచాయితీ కమిటీల ఎన్నిక,ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ‘కోటి సంతకాల సేకరణ’

పున్నమి ప్రతినిధి అల్లూరి జిల్లా అక్టోబర్ 30: అల్లూరి సీతారామ రాజు జిల్లా, జీకే వీధి మండలం గుమ్మిరేవుల పంచాయితీ అన్నవరంలో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నూతన పంచాయితీ కమిటీల ఎన్నిక కార్యక్రమం జరిగింది. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు, జిల్లా అధ్యక్షులు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.జీకే వీధి వైసీపీ మండల అధ్యక్షులు కంకిపాటి గిరి ప్రసాద్ ఆధ్వర్యంలో, గుమ్మిరేవుల సర్పంచ్ ముర్ల కమలమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గుమ్మిరేవుల పంచాయితీ పార్టీ అధ్యక్షులుగా వంతల రాంచందర్, గుమ్మిరేవుల పంచాయితీ ప్రధాన కార్యదర్శిగా కొర్ర అప్పారావు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.కమిటీ ఎన్నిక అనంతరం, రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటుకరణకు నిరసనగా వైసీపీ చేపట్టిన “కోటి సంతకాల సేకరణ” కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షులు కంకిపాటి గిరి ప్రసాద్, జీకే వీధి ఎంపీపీ బోయిన కుమారి మాట్లాడుతూ, పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసి, 2029లో జగన్ మోహన్ రెడ్డి ని రెండోసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. కార్యకర్తలకు ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు దృష్టిలో ఉంచి పరిష్కారం చేయిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జీకే వీది వైస్ ఎంపీపీ లోత దేముడు, లక్కవరపు పేట ఎంపీటీసీ మొట్టడం సత్య నారాయణ, మండల ప్రధాన కార్యదర్శి వంతల చంటి బాబు, మండల ఎస్.టి సెల్ అధ్యక్షులు కంకిపాటి నారాయణ రావు, మండల కార్యవర్గ సభ్యుడు గొల్లోరి మహదేవ్, గుమ్మిరేవుల పంచాయితీ ఉప సర్పంచ్ జోరంగి వెంకట రమణ, పార్టీ సీనియర్ నాయకులు కోడా బొంజి బాబు, చంద్ర బాబు, చిట్టి బాబు తో పాటు కాకనూరు, కనుసు మెట్ట, చింత గుప్ప, మాది మల్లు, నెల జర్త తదితర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

పున్నమి ప్రతినిధి అల్లూరి జిల్లా అక్టోబర్ 30:

అల్లూరి సీతారామ రాజు జిల్లా, జీకే వీధి మండలం గుమ్మిరేవుల పంచాయితీ అన్నవరంలో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నూతన పంచాయితీ కమిటీల ఎన్నిక కార్యక్రమం జరిగింది. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు, జిల్లా అధ్యక్షులు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.జీకే వీధి వైసీపీ మండల అధ్యక్షులు కంకిపాటి గిరి ప్రసాద్ ఆధ్వర్యంలో, గుమ్మిరేవుల సర్పంచ్ ముర్ల కమలమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గుమ్మిరేవుల పంచాయితీ పార్టీ అధ్యక్షులుగా వంతల రాంచందర్, గుమ్మిరేవుల పంచాయితీ ప్రధాన కార్యదర్శిగా కొర్ర అప్పారావు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.కమిటీ ఎన్నిక అనంతరం, రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటుకరణకు నిరసనగా వైసీపీ చేపట్టిన “కోటి సంతకాల సేకరణ” కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షులు కంకిపాటి గిరి ప్రసాద్, జీకే వీధి ఎంపీపీ బోయిన కుమారి మాట్లాడుతూ, పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసి, 2029లో జగన్ మోహన్ రెడ్డి ని రెండోసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. కార్యకర్తలకు ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు దృష్టిలో ఉంచి పరిష్కారం చేయిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జీకే వీది వైస్ ఎంపీపీ లోత దేముడు, లక్కవరపు పేట ఎంపీటీసీ మొట్టడం సత్య నారాయణ, మండల ప్రధాన కార్యదర్శి వంతల చంటి బాబు, మండల ఎస్.టి సెల్ అధ్యక్షులు కంకిపాటి నారాయణ రావు, మండల కార్యవర్గ సభ్యుడు గొల్లోరి మహదేవ్, గుమ్మిరేవుల పంచాయితీ ఉప సర్పంచ్ జోరంగి వెంకట రమణ, పార్టీ సీనియర్ నాయకులు కోడా బొంజి బాబు, చంద్ర బాబు, చిట్టి బాబు తో పాటు కాకనూరు, కనుసు మెట్ట, చింత గుప్ప, మాది మల్లు, నెల జర్త తదితర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.