గణేష్ వేడుకలు ప్రశాంతంగా జరగాలి
ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి
మండలంలో గణేష్ వేడుకలు ప్రశాంతంగా జరగాలని ఇందుకు అందరి సహకారం కావాలని ఎస్ఐ శుభ శేఖర్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో లో గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో వినాయక మండపాలు ఏర్పాటు చేసేవారు పోలీసులు, అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖ నుండి అనుమతి తప్పనిసరి అని తెలిపారు. మండపాల వద్ద జాగ్రత్తలు పాటించాలని, ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

గణేష్ వేడుకలు ప్రశాంతంగా జరగాలి
గణేష్ వేడుకలు ప్రశాంతంగా జరగాలి ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి మండలంలో గణేష్ వేడుకలు ప్రశాంతంగా జరగాలని ఇందుకు అందరి సహకారం కావాలని ఎస్ఐ శుభ శేఖర్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో లో గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో వినాయక మండపాలు ఏర్పాటు చేసేవారు పోలీసులు, అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖ నుండి అనుమతి తప్పనిసరి అని తెలిపారు. మండపాల వద్ద జాగ్రత్తలు పాటించాలని, ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

