Monday, 23 March 2026
  • Home  
  • క్రమశిక్షణకు నిదర్శనం: చిట్వేల్‌లో ఘనంగా ఎన్‌సీసీ దినోత్సవం
- అన్నమయ్య

క్రమశిక్షణకు నిదర్శనం: చిట్వేల్‌లో ఘనంగా ఎన్‌సీసీ దినోత్సవం

-చెత్త బుట్టల వినియోగంపై అవగాహన సెమినార్ – ప్రతిభ కనబరిచిన క్యాడెట్లకు బహుమతుల ప్రదానం చిట్వేల్‌, నవంబర్ 25: పున్నమి ప్రతినిధి 30వ ఆంధ్ర బెటాలియన్ ఎన్‌సీసీ కమాండింగ్ అధికారి కల్నల్ సూర్యనారాయణమూర్తి ఆదేశాల మేరకు చిట్వేల్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 78వ ఎన్‌సీసీ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఎన్‌సీసీ ట్రూప్ కమాండర్ పసుపుల రాజశేఖర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. -క్రమశిక్షణ, దేశభక్తి అవసరం ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. దుర్గరాజు మాట్లాడుతూ, నేటి విద్యార్థులకు ఎన్‌సీసీ శిక్షణ ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ శిక్షణ ద్వారా విద్యార్థులలో క్రమశిక్షణ, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు అలవడతాయని, ఇది వారి భవిష్యత్తుకు మార్గదర్శకంగా ఉంటుందని తెలిపారు. -పర్యావరణ స్పృహపై సెమినార్ ఎన్‌సీసీ దినోత్సవ వేడుకలలో భాగంగా సామాజిక బాధ్యతను పెంపొందించే ఉద్దేశంతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్‌సీసీ అధికారి పసుపుల రాజశేఖర్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో “చెత్త బుట్టలను సరైన రీతిలో ఉపయోగించడం ఎలా” అనే అంశంపై ఒక సెమినార్ నిర్వహించి, విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. -బహుమతులు, మొక్కల పెంపకం ఈ సెమినార్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎన్‌సీసీ క్యాడెట్లు సాయి సుజిత్, భరత్, కార్తీక్, ముస్కాన్, రుకయ, వైష్ణవి లకు పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు భాస్కర్ రెడ్డి, దాత జానీ కలిసి బహుమతులు అందజేశారు.తదనంతరం, పర్యావరణ పరిరక్షణకు తమ నిబద్ధతను చాటుతూ, ఎన్‌సీసీ క్యాడెట్లు అందరూ కలిసి పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు భాస్కర్ రెడ్డి, దాత జానీ, ఎన్‌సీసీ విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

-చెత్త బుట్టల వినియోగంపై అవగాహన సెమినార్ – ప్రతిభ కనబరిచిన క్యాడెట్లకు బహుమతుల ప్రదానం

చిట్వేల్‌, నవంబర్ 25: పున్నమి ప్రతినిధి

30వ ఆంధ్ర బెటాలియన్ ఎన్‌సీసీ కమాండింగ్ అధికారి కల్నల్ సూర్యనారాయణమూర్తి ఆదేశాల మేరకు చిట్వేల్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 78వ ఎన్‌సీసీ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఎన్‌సీసీ ట్రూప్ కమాండర్ పసుపుల రాజశేఖర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

-క్రమశిక్షణ, దేశభక్తి అవసరం

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. దుర్గరాజు మాట్లాడుతూ, నేటి విద్యార్థులకు ఎన్‌సీసీ శిక్షణ ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ శిక్షణ ద్వారా విద్యార్థులలో క్రమశిక్షణ, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు అలవడతాయని, ఇది వారి భవిష్యత్తుకు మార్గదర్శకంగా ఉంటుందని తెలిపారు.

-పర్యావరణ స్పృహపై సెమినార్

ఎన్‌సీసీ దినోత్సవ వేడుకలలో భాగంగా సామాజిక బాధ్యతను పెంపొందించే ఉద్దేశంతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్‌సీసీ అధికారి పసుపుల రాజశేఖర్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో “చెత్త బుట్టలను సరైన రీతిలో ఉపయోగించడం ఎలా” అనే అంశంపై ఒక సెమినార్ నిర్వహించి, విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు.

-బహుమతులు, మొక్కల పెంపకం

ఈ సెమినార్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎన్‌సీసీ క్యాడెట్లు సాయి సుజిత్, భరత్, కార్తీక్, ముస్కాన్, రుకయ, వైష్ణవి లకు పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు భాస్కర్ రెడ్డి, దాత జానీ కలిసి బహుమతులు అందజేశారు.తదనంతరం, పర్యావరణ పరిరక్షణకు తమ నిబద్ధతను చాటుతూ, ఎన్‌సీసీ క్యాడెట్లు అందరూ కలిసి పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు భాస్కర్ రెడ్డి, దాత జానీ, ఎన్‌సీసీ విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.