Tuesday, 7 April 2026
  • Home  
  • కోహెడ పండ్ల మార్కెట్ పై హరీశ్ రావు అబద్ధపు ప్రచారం చేస్తున్నారు..పండ్ల మార్కెట్ రైతులను,వ్యాపారులను మోసం చేసిన చరిత్ర BRS పార్టీది.
- E-పేపర్

కోహెడ పండ్ల మార్కెట్ పై హరీశ్ రావు అబద్ధపు ప్రచారం చేస్తున్నారు..పండ్ల మార్కెట్ రైతులను,వ్యాపారులను మోసం చేసిన చరిత్ర BRS పార్టీది.

పున్నమి న్యూస్ ప్రతినిధి తెలంగాణ ఇంచార్జ్ 07 ఏప్రిల్ 2026 కోహెడ పండ్ల మార్కెట్ పై హరీశ్ రావు అబద్ధపు ప్రచారం చేస్తున్నారు..పండ్ల మార్కెట్ రైతులను,వ్యాపారులను మోసం చేసిన చరిత్ర BRS పార్టీది.* *మార్కెట్ ను సర్వం ముంచిన చరిత్ర హరీశ్ రావు కే దక్కుతుంది..BRS నాయకులు ఇంకోసారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు..* *రెండు స్థలాలు మార్కెట్ కి సంబంధించినవే..ఒకటి హాల్ సెల్ మార్కెట్..మరొకటి అంతర్జాతీయ స్థాయి మార్కెట్.(ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్) దుష్ప్రచారాలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.* …….*AMC చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి హెచ్చరిక.* *కోహెడ పండ్ల మార్కెట్ స్థలం పైన మాజీ మంత్రి హరీశ్ రావు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై కాంగ్రేస్ నాయకులపై ఈర్ష్వ భావజాలంతో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ చిలుక మధుసూదన్ రెడ్డి ఆరోపించారు..* *మంగళవారం ఉదయం తొర్రూరు లోని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి గారి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో మార్కెట్ కమిటీ పాలకవర్గం సభ్యుల తో కలిసి చిలుక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ…….* *కోహెడ లో పండ్ల మార్కెట్ కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2011 సంవత్సరంలో కాంగ్రేస్ ప్రభుత్వం సుమారు 178:09 ఎకరాలు కేటాయించింది…గడిచిన 10 సంవత్సరాల BRS పాలనలో ఎలాంటి పురోగతి సాధించలేదని ఆరోపించారు..కొత్తపేట లో ఉన్న పండ్ల మార్కెట్ ను కరోనా వైరస్ పేరుతో కమీషన్లకు కక్కుర్తి పడి రాత్రికి రాత్రి 2020 సంవత్సరంలో ఎలాంటి జీవో జారీ చేయకుండా రోడ్డు మీదకి పంపించారని అన్నారు….అప్పటి BRS ప్రభుత్వం MLA లు కోహెడ కి సుమారు 5 కోట్లు కేటాయించి తాత్కాలిక టెంట్లతో ఏర్పాటు చేస్తే ఒక్క గాలివాన కు కొట్టుకుపోయిందని అన్నారు..ఆ తర్వాత 2021 సంవత్సరంలో సుమారు 4 కోట్లు ఖర్చు పెట్టి KTR బినామీల మీద ఉన్న బాటసింగారం HMDA లాజిస్టిక్ పార్కు కు తరలించారని తెలిపారు..వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మార్కెట్ నిర్మాణం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు..* *ఇప్పుడు ఉన్న 178:09 ఎకరాల మార్కెట్ స్థలాన్ని మార్కెట్ ఎగుమతులు దిగుమతుల కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లకు అనుమతి కోసం TGIIC కి ఇవ్వడం జరిగింది అన్నారు..దీనిలో వేరే ఉద్దేశం లేదని చెప్పారు..ఇప్పటికే ఉన్న భూమికి అదనంగా సర్వే నంబర్ 169/1 లో సుమారు 239 ఎకరాలు కొహెడ మార్కెట్ కి ఇస్తూ రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది..రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని అంతర్జాతీయoగా ఎగుమతులు దిగుమతులు చేసేందుకు ఈ రెండు స్థలాలు ఉపయోగపడతాయని అన్నారు…హరీష్ రావు గారు ఇతర సంస్థలకు భూములు ఇస్తున్నారన్న ఆరోపణలు పచ్చి అబద్ధాలు అన్నారు..పని లేని విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు..త్వరలోనే కోహెడలో అంతర్జాతీయ స్థాయి పండ్ల మార్కెట్ కి శంకుస్థాపన చేస్తామని రైతుల ఉద్యానవన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని చెప్పారు.ఒక స్థలం హాల్ సెల్ వ్యాపారం కోసమని,మరొకటి జాతీయ అంతర్జాతీయ మార్కెట్ ఎగుమతుల దిగుమతుల కోసమని చెప్పారు..రైతు సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు..BRS పార్టీ MLA లు ఇబ్రహీంపట్నం నాయకులు కోహెడ పండ్ల మార్కెట్ గురుంచి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు..రైతుల భూములు ఉంటే తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు..కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులు…BRS నాయకులతో సమావేశం పెట్టడం కాదని…దమ్ముంటే మార్కెట్ వ్యాపారులు రైతులతో మాట్లాడాలని సవాల్ చేశారు.* *ఈ సమావేశంలో వైస్ చైర్మన్ Ch,బాస్కర చారి…సభ్యులు బండి మధుసూదన్ రావు…పన్యాల జైపాల్ రెడ్డి…మేకం లక్ష్మి…గణేష్ నాయక్…మచ్చెందర్ రెడ్డి.. రఘుపతి రెడ్డి…గోవర్ధన్ రెడ్డి…నవరాజ్…వెంకటేశ్వర్లు గుప్తా…ఇబ్రహీం…తో పాటు పలువురు వ్యాపారులు పాల్గొన్నారు.*

పున్నమి న్యూస్ ప్రతినిధి
తెలంగాణ ఇంచార్జ్
07 ఏప్రిల్ 2026

కోహెడ పండ్ల మార్కెట్ పై హరీశ్ రావు అబద్ధపు ప్రచారం చేస్తున్నారు..పండ్ల మార్కెట్ రైతులను,వ్యాపారులను మోసం చేసిన చరిత్ర BRS పార్టీది.*

*మార్కెట్ ను సర్వం ముంచిన చరిత్ర హరీశ్ రావు కే దక్కుతుంది..BRS నాయకులు ఇంకోసారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు..*

*రెండు స్థలాలు మార్కెట్ కి సంబంధించినవే..ఒకటి హాల్ సెల్ మార్కెట్..మరొకటి అంతర్జాతీయ స్థాయి మార్కెట్.(ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్) దుష్ప్రచారాలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.*

…….*AMC చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి హెచ్చరిక.*

*కోహెడ పండ్ల మార్కెట్ స్థలం పైన మాజీ మంత్రి హరీశ్ రావు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై కాంగ్రేస్ నాయకులపై ఈర్ష్వ భావజాలంతో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ చిలుక మధుసూదన్ రెడ్డి ఆరోపించారు..*

*మంగళవారం ఉదయం తొర్రూరు లోని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి గారి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో మార్కెట్ కమిటీ పాలకవర్గం సభ్యుల తో కలిసి చిలుక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ…….*

*కోహెడ లో పండ్ల మార్కెట్ కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2011 సంవత్సరంలో కాంగ్రేస్ ప్రభుత్వం సుమారు 178:09 ఎకరాలు కేటాయించింది…గడిచిన 10 సంవత్సరాల BRS పాలనలో ఎలాంటి పురోగతి సాధించలేదని ఆరోపించారు..కొత్తపేట లో ఉన్న పండ్ల మార్కెట్ ను కరోనా వైరస్ పేరుతో కమీషన్లకు కక్కుర్తి పడి రాత్రికి రాత్రి 2020 సంవత్సరంలో ఎలాంటి జీవో జారీ చేయకుండా రోడ్డు మీదకి పంపించారని అన్నారు….అప్పటి BRS ప్రభుత్వం MLA లు కోహెడ కి సుమారు 5 కోట్లు కేటాయించి తాత్కాలిక టెంట్లతో ఏర్పాటు చేస్తే ఒక్క గాలివాన కు కొట్టుకుపోయిందని అన్నారు..ఆ తర్వాత 2021 సంవత్సరంలో సుమారు 4 కోట్లు ఖర్చు పెట్టి KTR బినామీల మీద ఉన్న బాటసింగారం HMDA లాజిస్టిక్ పార్కు కు తరలించారని తెలిపారు..వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మార్కెట్ నిర్మాణం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు..*

*ఇప్పుడు ఉన్న 178:09 ఎకరాల మార్కెట్ స్థలాన్ని మార్కెట్ ఎగుమతులు దిగుమతుల కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లకు అనుమతి కోసం TGIIC కి ఇవ్వడం జరిగింది అన్నారు..దీనిలో వేరే ఉద్దేశం లేదని చెప్పారు..ఇప్పటికే ఉన్న భూమికి అదనంగా సర్వే నంబర్ 169/1 లో సుమారు 239 ఎకరాలు కొహెడ మార్కెట్ కి ఇస్తూ రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది..రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని అంతర్జాతీయoగా ఎగుమతులు దిగుమతులు చేసేందుకు ఈ రెండు స్థలాలు ఉపయోగపడతాయని అన్నారు…హరీష్ రావు గారు ఇతర సంస్థలకు భూములు ఇస్తున్నారన్న ఆరోపణలు పచ్చి అబద్ధాలు అన్నారు..పని లేని విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు..త్వరలోనే కోహెడలో అంతర్జాతీయ స్థాయి పండ్ల మార్కెట్ కి శంకుస్థాపన చేస్తామని రైతుల ఉద్యానవన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని చెప్పారు.ఒక స్థలం హాల్ సెల్ వ్యాపారం కోసమని,మరొకటి జాతీయ అంతర్జాతీయ మార్కెట్ ఎగుమతుల దిగుమతుల కోసమని చెప్పారు..రైతు సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు..BRS పార్టీ MLA లు ఇబ్రహీంపట్నం నాయకులు కోహెడ పండ్ల మార్కెట్ గురుంచి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు..రైతుల భూములు ఉంటే తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు..కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులు…BRS నాయకులతో సమావేశం పెట్టడం కాదని…దమ్ముంటే మార్కెట్ వ్యాపారులు రైతులతో మాట్లాడాలని సవాల్ చేశారు.*

*ఈ సమావేశంలో వైస్ చైర్మన్ Ch,బాస్కర చారి…సభ్యులు బండి మధుసూదన్ రావు…పన్యాల జైపాల్ రెడ్డి…మేకం లక్ష్మి…గణేష్ నాయక్…మచ్చెందర్ రెడ్డి.. రఘుపతి రెడ్డి…గోవర్ధన్ రెడ్డి…నవరాజ్…వెంకటేశ్వర్లు గుప్తా…ఇబ్రహీం…తో పాటు పలువురు వ్యాపారులు పాల్గొన్నారు.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.