Sunday, 15 March 2026
  • Home  
  • కోవూరు షుగర్ ఫ్యాక్టరీను పునరుద్ధరించాలి అఖిలపక్ష రైతు సంఘాల రౌండ్ టేబుల్ డిమాండ్
- Featured

కోవూరు షుగర్ ఫ్యాక్టరీను పునరుద్ధరించాలి అఖిలపక్ష రైతు సంఘాల రౌండ్ టేబుల్ డిమాండ్

కోవూరు షుగర్ ఫ్యాక్టరీను పునరుద్ధరించాలి అఖిలపక్ష రైతు సంఘాల రౌండ్ టేబుల్ డిమాండ్     కోవూరు షుగర్ ఫ్యాక్టరీను అమ్మకుండా, తక్షణమే పునరుద్ధరించాలని అఖిలపక్ష రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ నెల 21న, ఆదివారం ఉదయం 11 గంటలకు నెల్లూరు డాక్టర్ జేఎస్ ట్రస్ట్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ తీర్మానం వెలువడింది. చెరుకు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి గండవరపు శ్రీనివాసులరి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించబడింది. 124 ఎకరాల విలువైన భూమిని కలిగి ఉన్న ఈ ఫ్యాక్టరీను, చౌకగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగించాలన్న ప్రభుత్వ యత్నాలను వెంటనే ఆపాలని సమావేశంలో పాల్గొన్నవారు డిమాండ్ చేశారు. 15 మండలాల్లోని 4 వేల పైగా చెరుకు రైతు కుటుంబాలు, ఈ ఫ్యాక్టరీ ద్వారా ఆధారపడ్డాయి. అలాగే వేలాది మంది కార్మికులు, కూలీలు జీవనోపాధిని పొందారు. పాలక వర్గాల పాలనా వైఫల్యం కారణంగా ఫ్యాక్టరీ మూత పడినప్పటికీ, ఇప్పుడు తిరిగి ప్రారంభిస్తే 3 నియోజకవర్గాలలోని 10 వేల పైగా కుటుంబాలకు లాభం చేకూరుతుంది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో ఫ్యాక్టరీని తెరిచే హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సమావేశంలో రైతు నాయకులు యర్రం రెడ్డి, గోవర్ధన రెడ్డి, ఏవి రమణయ్య నాయుడు, హనుమంతరావు, చంద్ర రాజగోపాల్, ములి వెంగయ్య, జొన్నలగడ్డ వెంకటరాజు, బిళ్ళా రఘురామయ్య, ఏటూరు శ్రీనివాసుల రెడ్డి, గండవరపు శేషయ్య, పి. మల్లికార్జున, పి. శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

కోవూరు షుగర్ ఫ్యాక్టరీను పునరుద్ధరించాలి

అఖిలపక్ష రైతు సంఘాల రౌండ్ టేబుల్ డిమాండ్

 

 

కోవూరు షుగర్ ఫ్యాక్టరీను అమ్మకుండా, తక్షణమే పునరుద్ధరించాలని అఖిలపక్ష రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ నెల 21న, ఆదివారం ఉదయం 11 గంటలకు నెల్లూరు డాక్టర్ జేఎస్ ట్రస్ట్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ తీర్మానం వెలువడింది. చెరుకు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి గండవరపు శ్రీనివాసులరి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించబడింది.

124 ఎకరాల విలువైన భూమిని కలిగి ఉన్న ఈ ఫ్యాక్టరీను, చౌకగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగించాలన్న ప్రభుత్వ యత్నాలను వెంటనే ఆపాలని సమావేశంలో పాల్గొన్నవారు డిమాండ్ చేశారు. 15 మండలాల్లోని 4 వేల పైగా చెరుకు రైతు కుటుంబాలు, ఈ ఫ్యాక్టరీ ద్వారా ఆధారపడ్డాయి. అలాగే వేలాది మంది కార్మికులు, కూలీలు జీవనోపాధిని పొందారు.

పాలక వర్గాల పాలనా వైఫల్యం కారణంగా ఫ్యాక్టరీ మూత పడినప్పటికీ, ఇప్పుడు తిరిగి ప్రారంభిస్తే 3 నియోజకవర్గాలలోని 10 వేల పైగా కుటుంబాలకు లాభం చేకూరుతుంది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో ఫ్యాక్టరీని తెరిచే హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

ఈ సమావేశంలో రైతు నాయకులు యర్రం రెడ్డి, గోవర్ధన రెడ్డి, ఏవి రమణయ్య నాయుడు, హనుమంతరావు, చంద్ర రాజగోపాల్, ములి వెంగయ్య, జొన్నలగడ్డ వెంకటరాజు, బిళ్ళా రఘురామయ్య, ఏటూరు శ్రీనివాసుల రెడ్డి, గండవరపు శేషయ్య, పి. మల్లికార్జున, పి. శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.