*బట్టేలంక గ్రామకమిటీ ఆధ్వర్యంలో జరిగిన “కోటి సంతకాల ప్రజా ఉద్యమ రచ్చబండ” కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి గొల్లపల్లి.*
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండలం:
రాజోలు నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ గొల్లపల్లి సూర్యరావు గారి పిలుపుమేరకు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు గుర్రం జాషువా ఆధ్వర్యంలో, బట్టేలంక గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షులు కందికట్ల రత్నబాబు అధ్యక్షతన *”మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా” వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం గ్రామస్థాయి రచ్చబండ కార్యక్రమం* నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బట్టేలంక గ్రామంలో కోటి సంతకాల ప్రజాఉద్యమ రచ్చబండ కార్యక్రమ కరపత్రాలను గొల్లపల్లి సూర్యా రావు గారు కమిటీ వారికి అందజేసి, గ్రామానికి వెయ్యి సంతకాలు సేకరించి మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణను ఆపడంలో భాగస్వాములు కావాలని కోరడం జరిగింది.
ఈ సందర్భంగా గొల్లపల్లి సూర్యరావు గారు మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వలన పేద మధ్యతరగతి విద్యార్థులు, తల్లిదండ్రులు ఏమి కోల్పోతారో గ్రామస్తులకు వివరించారు. విద్య వైద్యం ప్రతి ఒక్కరి హక్కు, ప్రతి కార్యకర్త ఈ విషయాలు ప్రజలకు తెలియపరచాలని సూచించారు.
ఈ కార్యక్రమంలోరాష్ట్ర కార్యదర్శి, కొత్తపేట నియోజకవర్గ పరిశీలకులు పాటి శివకుమార్, నేతల నాని బాబు, మోకా సురేష్, చింతా ప్రసాద్, జిల్లెళ్ళ ఉదయ్ కిరణ్, నల్లి శరత్ గార్లు.
స్థానిక గ్రామ నాయకులు: మాజీ గ్రామశాఖ అధ్యక్షులు కడలి శ్రీనివాస్, కందికట్ల విజయకుమార్, మంద ప్రభుదాస్, నల్లి పెద్దిరాజు, తోట నానాజీ, బోనం సురేష్ గార్లు మరియు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.


