– విద్యార్థినుల భవిష్యత్తుకు ప్రాధాన్యత!
కామారెడ్డి, 31జనవరి, ( పున్నమి ప్రతినిధి ) :
కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో శుక్రవారం రామారెడ్డి గ్రామ సర్పంచ్ బండి ప్రవీణ్ క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు.విద్యార్థినుల భోజ నం, విద్యా నాణ్యత, ఆరోగ్యం, సౌకర్యాలపై ఆధా రంగా పూర్తి పరిశీలన చేపట్టిన సర్పంచ్, పాఠశాల పరిపాలనకు కొత్త దిశా ఇచ్చారు.ఈ సందర్భంగా మాట్లాడిన సర్పంచ్, వంటశాల గది,పాత్రలు పరి శుభ్రంగా ఉంచాలన్నారు. విద్యార్థినులకు అధిక నాణ్యత కలిగిన భోజనం అందించాలని చెప్పారు. భోజనంలో ఏ కాస్త నాణ్యత లోపం వస్తే ఊరుకో మని హెచ్చరించారు.ఈ విషయంలో ఎట్టి పరిహా రాలు కావాలంటే చేస్తాము అని స్పష్టం చేశారు. పదవ తరగతి విద్యార్థినులపై ప్రత్యేక దృష్టి సారిం చిన ఆయన,వారికి స్పెషల్ క్లాసులు నిర్వహించి విద్యలో రాణించేలా తయారు చేయాలని చెప్పా రు.మండలంలోని విద్యార్థినులు మంచిగా చదువు కొని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు గర్వకార ణంగా నిలబడాలని చెప్పారు. జిల్లా స్థాయిలో టాప్ ర్యాంకులు సాధించాలి అని పిలుపునిచ్చా రు. పాఠశాలలో మిడ్ డే మీల్స్ వంటలు, గదుల పరిశుభ్రత, టాయిలెట్లు, తాగునీరు సౌకర్యాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. రామారెడ్డి మండలంలో ఒకటి కస్తూర్బా పాఠశాల లు ఉండగా, ఇక్కడ వందల మంది బాలికలు చదువుతున్నారు. ఇటీవల పంచాయతీ సమావే శాల్లో ఈ పాఠశాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వా లని ప్రతిపాదించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పం చ్ నవీన్, వార్డు సభ్యులు, గ్రామ నాయకులు, పాఠ శాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


