Thursday, 5 February 2026
  • Home  
  • కల్లూరు లో హాస్టల్ తీరు.
- ఖమ్మం

కల్లూరు లో హాస్టల్ తీరు.

*ఈ హాస్టల్ లో మేముండలేం….* *పశువుల కంటే హీనంగా చూస్తున్నారు* *కూర అడిగితే గరిటతో కొడుతున్నారు…* *కిచిడీ తిని… 40 మంది విద్యార్థులకు ఆస్వస్థత* *హాస్టల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే రాగమయి* *హస్పటల్ సందర్శించిన సబ్ కలెక్టర్* *వైద్యం అందించిన డాక్టర్ నవ్య కాంత్* *కారకులపై చర్యలు తీసుకోవాలి-ప్రజా సంఘాలు* (కల్లూరు ) ఖమ్మం పున్నమి స్టాఫర్ ఆగష్టు వారంతా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాల నుండి వచ్చిన పిల్లలు. కొందరికి తండ్రి లేరు. కొందరికి తల్లి లేరు.ఇంకొంత మందికి తల్లిదండ్రులు లేరు. మరి కొందరి ఆర్థిక పరిస్థితులు అనుకూలించక ఐ టి డి ఐ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న గిరిజన సంక్షేమ హాస్టల్లో చదువుతున్న పిల్లలు. సోమవారం ఉదయం కిచిడీ తిని అస్వస్థకు గురయ్యారు నాసిరకమైన ఉడికి ఉడకని కిచిడీ తిని అసోస్త గురై ఆసుపత్రి పాలైన సంఘటన కల్లూరులో చోటు చేసుకుంది వివరాల్లోకెళ్తే కల్లూరు మున్సిపాలిటీ పరిధి గిరిజన సంక్షేమ హాస్టల్ లో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్పందించిన హాస్టల్ సిబ్బంది ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అందుబాటులో ఉన్న డాక్టర్ నవ్య కాంత్ సిబ్బందితో కలిసి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించి ప్రాణాప్రాయం నుండి కాపాడారు. సోమవారం ఉదయం కిచిడి తిన్న విద్యార్థులు అందరూ కడుపునొప్పి, వాంతులు కాగా విద్యార్థులు అస్వస్థతకు అవ్వడంతో గురయ్యారు. విషయం తెలుసుకున్న ఏ ఎం సి చైర్మన్ హాస్పిటల్ కి చేసుకుని విద్యార్థుల పరిస్థితి స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ కు తెలపగా స్పందించిన ఎమ్మెల్యే హుటాహుటిన కల్లూరు ప్రభుత్వ హాస్పిటల్ కి చేరుకుని చికిత్స పొందుతున్న విద్యార్థులను చూసి చలించి ఆమె వైద్యం చేశారు.స్వతహాగా డాక్టర్ అయిన ఎమ్మెల్యే విద్యార్థులకు వైద్యం అందించి మనోధైర్యాన్ని కల్పించారు. అనంతరం హాస్టల్ సందర్శించి జరిగిన సంఘటనపై హాస్టల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పిల్లలకైతే ఇలాంటి భోజనం పెడతారా, అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి నాణ్యమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో మెనూ రేట్లు కూడా పెంచితే ,నిర్లక్ష్యంగా వ్యవహరించి నాసిరకమైన ఆహారం అందిస్తారా అని హాస్టల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ హాస్పిటల్లో వైద్యం పొందుతున్న విద్యార్థులను పరామర్శించి,మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ నవ్య కాంత్ కి సూచించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. స్థానిక ఎమ్మార్వో పులి సాంబశివుడు, ఎంపీడీవో చంద్రశేఖర్, ఏఎంసీ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి విషయం తెలిసిన వెంటనే హాస్పటల్ కు చేరుకుని, దగ్గరుండి విద్యార్థులకు మనోధైర్యాన్ని కల్పిస్తూ మెరుగైన వైద్యాన్ని అందించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఈ హాస్టల్లో మేము ఉండలేమని ,పశువుల కంటే హీనంగా చూస్తున్నారని ,తమ ఆవేదన వ్యక్తం చేశారు. పురుగులు అన్నం పెడుతున్నారని ,ప్రశ్నిస్తే కొడుతున్నారని, కూర అడిగితే వంట మనిషి గరిటతో కొడుతుందని ,మీ ఇండ్లలో ఇంతకంటే నాణ్యమైన అన్నం తింటున్నారా అంటూ,మారు అన్నం అడిగిన తిడుతున్నారని విద్యార్థులు వాపోయారు. ఏది ఏమైనా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వార్డెన్, వంట మనిషిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం, సిపిఐ, ఎస్ఎఫ్ఐ, విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. అనేక సమస్యలతో ఉన్న హాస్టల్లో పరిస్థితిని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా అధికారులతో మాట్లాడి పూర్తి రక్షణ కల్పించే విధంగా, నాణ్యమైన ఫుడ్ అందించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఉడికకీ ఉడకని కిచిడీ తిన్న విద్యార్థులు మాత్రమే అస్వస్థతకు గురై ఇబ్బంది పడ్డారని అధికారులు తెలిపారు. విద్యార్థులు తిన్న కిచిడిని ఎమ్మెల్యే రాగమయి, డాక్టర్ నవ్య కాంత్,తహశీల్దార్, ఎంపీడీవో పరిశీలించారు. ఆ స్వస్థతకు గురైన విద్యార్థులను ఏఎంసీ చైర్మన్ భాగం నీరజాదేవి, ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షులు పసుమర్తి చందర్రావు తమ వాహనాల్లో ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. ఏది ఏమైనా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.

*ఈ హాస్టల్ లో మేముండలేం….*

*పశువుల కంటే హీనంగా చూస్తున్నారు*

*కూర అడిగితే గరిటతో కొడుతున్నారు…*

*కిచిడీ తిని… 40 మంది విద్యార్థులకు ఆస్వస్థత*

*హాస్టల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే రాగమయి*

*హస్పటల్ సందర్శించిన సబ్ కలెక్టర్*

*వైద్యం అందించిన డాక్టర్ నవ్య కాంత్*

*కారకులపై చర్యలు తీసుకోవాలి-ప్రజా సంఘాలు*
(కల్లూరు )
ఖమ్మం పున్నమి స్టాఫర్
ఆగష్టు
వారంతా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాల నుండి వచ్చిన పిల్లలు. కొందరికి తండ్రి లేరు. కొందరికి తల్లి లేరు.ఇంకొంత మందికి తల్లిదండ్రులు లేరు. మరి కొందరి ఆర్థిక పరిస్థితులు అనుకూలించక ఐ టి డి ఐ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న గిరిజన సంక్షేమ హాస్టల్లో చదువుతున్న పిల్లలు. సోమవారం ఉదయం కిచిడీ తిని అస్వస్థకు గురయ్యారు నాసిరకమైన ఉడికి ఉడకని కిచిడీ తిని అసోస్త గురై ఆసుపత్రి పాలైన సంఘటన కల్లూరులో చోటు చేసుకుంది వివరాల్లోకెళ్తే
కల్లూరు మున్సిపాలిటీ పరిధి గిరిజన సంక్షేమ హాస్టల్ లో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్పందించిన హాస్టల్ సిబ్బంది ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అందుబాటులో ఉన్న డాక్టర్ నవ్య కాంత్ సిబ్బందితో కలిసి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించి ప్రాణాప్రాయం నుండి కాపాడారు. సోమవారం ఉదయం కిచిడి తిన్న విద్యార్థులు అందరూ కడుపునొప్పి, వాంతులు కాగా విద్యార్థులు అస్వస్థతకు అవ్వడంతో గురయ్యారు. విషయం తెలుసుకున్న ఏ ఎం సి చైర్మన్ హాస్పిటల్ కి చేసుకుని విద్యార్థుల పరిస్థితి స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ కు తెలపగా స్పందించిన ఎమ్మెల్యే హుటాహుటిన కల్లూరు ప్రభుత్వ హాస్పిటల్ కి చేరుకుని చికిత్స పొందుతున్న విద్యార్థులను చూసి చలించి ఆమె వైద్యం చేశారు.స్వతహాగా డాక్టర్ అయిన ఎమ్మెల్యే విద్యార్థులకు వైద్యం అందించి మనోధైర్యాన్ని కల్పించారు. అనంతరం హాస్టల్ సందర్శించి జరిగిన సంఘటనపై హాస్టల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పిల్లలకైతే ఇలాంటి భోజనం పెడతారా, అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి నాణ్యమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో మెనూ రేట్లు కూడా పెంచితే ,నిర్లక్ష్యంగా వ్యవహరించి నాసిరకమైన ఆహారం అందిస్తారా అని హాస్టల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ హాస్పిటల్లో వైద్యం పొందుతున్న విద్యార్థులను పరామర్శించి,మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ నవ్య కాంత్ కి సూచించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. స్థానిక ఎమ్మార్వో పులి సాంబశివుడు, ఎంపీడీవో చంద్రశేఖర్, ఏఎంసీ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి విషయం తెలిసిన వెంటనే హాస్పటల్ కు చేరుకుని, దగ్గరుండి విద్యార్థులకు మనోధైర్యాన్ని కల్పిస్తూ మెరుగైన వైద్యాన్ని అందించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఈ హాస్టల్లో మేము ఉండలేమని ,పశువుల కంటే హీనంగా చూస్తున్నారని ,తమ ఆవేదన వ్యక్తం చేశారు. పురుగులు అన్నం పెడుతున్నారని ,ప్రశ్నిస్తే కొడుతున్నారని, కూర అడిగితే వంట మనిషి గరిటతో కొడుతుందని ,మీ ఇండ్లలో ఇంతకంటే నాణ్యమైన అన్నం తింటున్నారా అంటూ,మారు అన్నం అడిగిన తిడుతున్నారని విద్యార్థులు వాపోయారు. ఏది ఏమైనా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వార్డెన్, వంట మనిషిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం, సిపిఐ, ఎస్ఎఫ్ఐ, విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. అనేక సమస్యలతో ఉన్న హాస్టల్లో పరిస్థితిని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా అధికారులతో మాట్లాడి పూర్తి రక్షణ కల్పించే విధంగా, నాణ్యమైన ఫుడ్ అందించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఉడికకీ ఉడకని కిచిడీ తిన్న విద్యార్థులు మాత్రమే అస్వస్థతకు గురై ఇబ్బంది పడ్డారని అధికారులు తెలిపారు. విద్యార్థులు తిన్న కిచిడిని ఎమ్మెల్యే రాగమయి, డాక్టర్ నవ్య కాంత్,తహశీల్దార్, ఎంపీడీవో పరిశీలించారు. ఆ స్వస్థతకు గురైన విద్యార్థులను ఏఎంసీ చైర్మన్ భాగం నీరజాదేవి, ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షులు పసుమర్తి చందర్రావు తమ వాహనాల్లో ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. ఏది ఏమైనా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.