నాగర్ కర్నూల్ అక్టోబర్ 18
:వెల్దండ మండల సమీపంలోని రాచూర్ తాండా(Rachur Tanda)కి చెందిన వర్త్యవత్ ఫకీర(Vartyawat Fakir)కి వ్యవసాయ కాడి ఎద్దు ఈ రోజు కరెంట్ షాక్ తో మృతి చెందిందన్నారు. రైతు తెలిపిన వివరాల ప్రకారం వ్యవసాయ పొలంలో గడ్డిమేస్తున్న సమయంలో కరెంటు వైరు(Electricity Wire) తగిలి కాడి ఎద్దు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
ఎద్దు విలువ 70 వేల రూపాయలు ఉంటుందని వారు బోరున విలపిస్తూ ప్రభుత్వం నుండి ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.


