పవిత్ర కార్తీక మాసం పురస్కరించుకుని నంద్యాల ఐ ఎం ఏ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఆర్ద్ర నక్షత్రంలో స్థానిక సంజీవనగర్ రామాలయం లో శివపార్వతుల కళ్యాణం, అభిషేక పూజలు నిర్వహించారు.
ఐఎంఏ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డాక్టర్ అనిల్ కుమార్ నిర్వహణలో, ప్రముఖ సిద్ధాంతి కార్తికేయ శర్మ పౌరోహిత్యంలో కల్యాణోత్సవం మూడు గంటలపాటు ఘనంగా నిర్వహించారు. కార్తికేయ శర్మ కార్తీక మాసంలో శివపార్వతుల కళ్యాణ విశిష్టతను వివరించారు.
కళ్యాణోత్సవం, అభిషేక పూజలలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, సతీమణి సునంద, ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, డాక్టర్ ఈశ్వరి, మాజీ ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ అనిల్ కుమార్ , డాక్టర్ హరిత, నంద్యాల ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ పనిల్ కుమార్, డాక్టర్ లలిత,డాక్టర్ నెరవాటి వినోద్ కుమార్, డాక్టర్ అరుణ కుమారి,డాక్టర్ పెసల అశోక్ కుమార్, డాక్టర్ సునీత, డాక్టర్ పాండురంగారావు, డాక్టర్ శైలజ, డాక్టర్ నిరంజన్ రెడ్డి దంపతులు కంకణ ధారణ చేసి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ నంద్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో అన్ని మతాల పర్వదినాలను అనవాయితీగా నిర్వహిస్తున్నామని, ఐక్య భావన కోసం, లోక కళ్యాణం కాంక్షించి శివపార్వతుల కళ్యాణం నిర్వహించామని తెలిపారు.
డాక్టర్ సహదేవుడు,డాక్టర్ జఫరుల్లా పురాణ, ఇతిహాసాల లో ఉన్న కార్తీక మాస విశేషాలను శ్లోకాలతో వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ,సునంద దంపతులను శాలువా, పూల మాలతో ఐఎంఏ సభ్యులు సత్కరించారు.
ఈ కార్యక్రమాలలో భగవత్ సేవా సమాజ్ అధ్యక్షులు సూరయ్య,డాక్టర్ సహదేవుడు, డాక్టర్ రవికాంత్ రెడ్డి, డాక్టర్ లక్ష్మీబాయి, డాక్టర్ నెట్ల మహేశ్వర్ రెడ్డి, డాక్టర్ జఫరుల్లా,డాక్టర్ షబ్నం తదితరులు పాల్గొన్నారు.

ఐఎంఏ నంద్యాల అన్ని మతాల పర్వదినాలు నిర్వహించడం అనవాయితీ: డాక్టర్ రవి కృష్ణ
పవిత్ర కార్తీక మాసం పురస్కరించుకుని నంద్యాల ఐ ఎం ఏ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఆర్ద్ర నక్షత్రంలో స్థానిక సంజీవనగర్ రామాలయం లో శివపార్వతుల కళ్యాణం, అభిషేక పూజలు నిర్వహించారు. ఐఎంఏ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డాక్టర్ అనిల్ కుమార్ నిర్వహణలో, ప్రముఖ సిద్ధాంతి కార్తికేయ శర్మ పౌరోహిత్యంలో కల్యాణోత్సవం మూడు గంటలపాటు ఘనంగా నిర్వహించారు. కార్తికేయ శర్మ కార్తీక మాసంలో శివపార్వతుల కళ్యాణ విశిష్టతను వివరించారు. కళ్యాణోత్సవం, అభిషేక పూజలలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, సతీమణి సునంద, ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, డాక్టర్ ఈశ్వరి, మాజీ ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ అనిల్ కుమార్ , డాక్టర్ హరిత, నంద్యాల ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ పనిల్ కుమార్, డాక్టర్ లలిత,డాక్టర్ నెరవాటి వినోద్ కుమార్, డాక్టర్ అరుణ కుమారి,డాక్టర్ పెసల అశోక్ కుమార్, డాక్టర్ సునీత, డాక్టర్ పాండురంగారావు, డాక్టర్ శైలజ, డాక్టర్ నిరంజన్ రెడ్డి దంపతులు కంకణ ధారణ చేసి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ నంద్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో అన్ని మతాల పర్వదినాలను అనవాయితీగా నిర్వహిస్తున్నామని, ఐక్య భావన కోసం, లోక కళ్యాణం కాంక్షించి శివపార్వతుల కళ్యాణం నిర్వహించామని తెలిపారు. డాక్టర్ సహదేవుడు,డాక్టర్ జఫరుల్లా పురాణ, ఇతిహాసాల లో ఉన్న కార్తీక మాస విశేషాలను శ్లోకాలతో వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ,సునంద దంపతులను శాలువా, పూల మాలతో ఐఎంఏ సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమాలలో భగవత్ సేవా సమాజ్ అధ్యక్షులు సూరయ్య,డాక్టర్ సహదేవుడు, డాక్టర్ రవికాంత్ రెడ్డి, డాక్టర్ లక్ష్మీబాయి, డాక్టర్ నెట్ల మహేశ్వర్ రెడ్డి, డాక్టర్ జఫరుల్లా,డాక్టర్ షబ్నం తదితరులు పాల్గొన్నారు.

