సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @అమరావతి :
గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,120 కోట్లు పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్తులకు మంగళవారం విడుదల చేశారు. వాటి బ్యాంకు ఖాతాలకు బుధవారం నిధులు జమకానున్నాయి.
2024-25 ఆర్థిక సంవత్సరం లో రెండో విడత రూ.1,120 కోట్ల విడుదలలో జాప్యంపై ఇటీవల పలువురు సర్పంచులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
ఈ మేరకు మొత్తం నిధులను రాష్ట్ర ఆర్థికశాఖ పంచాయతీలకు 70%, మండల పరిషత్తులకు 20%, జిల్లా పరిషత్తులకు 10% చొప్పున విడుదల చేసింది.


