Tuesday, 24 March 2026
  • Home  
  • ఏపీ ఎంబీసీ లో టెండర్లు పిలవకుండా ఎవరికి మేలు చేస్తున్నట్టు సిఐటియు జిల్లా నాయకులు
- ఆంధ్రప్రదేశ్

ఏపీ ఎంబీసీ లో టెండర్లు పిలవకుండా ఎవరికి మేలు చేస్తున్నట్టు సిఐటియు జిల్లా నాయకులు

ఓబులవారిపల్లె అక్టోబర్ పున్నమి ప్రతినిధి ఏపీఎండీసీ సంస్థ నందు A గ్రేడ్ B గ్రేడ్ మరియు C&D గ్రేడ్ ఖనిజాలకు సుమారు సంవత్సర కాలంగా టెండర్లు పిలవకుండా ఎవరికి మేలు చేస్తున్నారని ఏపీఎండీసీ యాజమాన్యం పై మండిపడినసీఐటీయూ జిల్లా నాయకులు ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి సీఐటీయూ అన్నమయ్య జిల్లా అధ్యక్ష&కార్యదర్శులు సిహెచ్ చంద్రశేఖర్, రామాంజినేయులు మాట్లాడుతూ ఏపీఎండీసీ సంస్థ స్థాపించి సుమారు 50 సంవత్సరములలో ఏపీఎండీసీ సంస్థలో ఇంత అవినీతి అరాచక పాలన ఎప్పుడూ చూడలేదని సీఐటీయూ నాయకులు మండిపడ్డారు,A గ్రేడ్ బి గ్రేడ్ C&D గ్రేడ్ ఖనిజాలకు టెండర్ పిలిచి ఆ టెండర్ ను రద్దు చేసి తిరిగి టెండర్లు సుమారు సంవత్సరకాలం అవుతున్నా పిలవక పోవడంలో అంతర్యం ఏమిటో,ఏపీఎండీసీ యాజమాన్యం చెప్పాలని వారు డిమాండ్ చేశారు,దీనివలన సంస్థకు కోట్లాది రూపాయలు గండి పడుతుంటే కూటమి ప్రభుత్వం చోధ్యం చూస్తున్నారని అన్నారు, గతంలో C&D గ్రేడ్ బల్క్ టెండర్ ను రేట్ తగ్గించి ఒక బయ్యర్ కు కట్టపెట్టిన దానివలన సంస్థకు కోట్లాది రూపాయలు గండి పడింది, దీని వలన కొంత మంది బయ్యర్స్ మాకు కూడా ఖనిజం రేట్ తగ్గించి ఇవ్వాలని కోర్ట్ ను ఆశ్రయించారు, ఇప్పుడు ఏపీఎండీసీ టెండర్లు పిలిస్తే సంస్థ చేసిన తప్పు బయటపడుతుందని టెండర్స్ పిలవకుండా సంస్థ మనుగడే లేకుండా చేస్తున్నారని అన్నారుఏపీఎండీసీ యాజమాన్యం వారు చేస్తున్న తప్పుకు సంస్థ నిర్వర్యం అవుతుందనివీటిని మేము లెక్కళ్ళతో సహా చెబుతున్నామని ఇది చూసైనా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారుఏపీఎండీసీ యాజమాన్యం వారు చేస్తున్న సంస్థ లూటీలో ఒక గ్రేడ్ ఉదాహరణ గాA గ్రేడ్ ఖనిజం ఒక టన్ను విలువ వివరాలు :*గత టెండర్ లో బేసిక్ ప్రైస్:7226*సీనరీజస్ చార్జెస్ :480 రూపాయలు*సీనరీజస్ మీద డియంయఫ్ చార్జెస్ 30%*సీనరీజస్ మీద 2% మెరిట్ చార్జెస్*చెస్ చార్జెస్ 20 రూపాయలు*లోడింగ్ చార్జెస్ 25 రూపాయలు*వీటి అన్నిటికి 5 % GST కలిపి = ఒక టన్ను A గ్రేడ్ ఖనిజం 8309 రూపాయలు గత టెండర్ లో ఉన్నింది అయితే ఏపీఎండీసీ యాజమాన్యం వారు టెండర్లు అయిపోయి సుమారు ఒక సంవత్సరం పైన అవుతున్నా ఇంత వరకు టెండర్ పిలవకుండా గత టెండర్ లో వేసిన అమౌంట్ కు కేవలం 10 % మాత్రమే పెంచి ఈ ఖనిజాన్ని బయ్యర్స్ కు ఇస్తున్నారు ఇందులోనే అసలైన మెలిక ఉంది టెండర్ పిలిస్తే మూడు గ్రేడ్లకు ఖనిజానికి మంచి డిమాండ్ ఉంది కాబట్టి రేట్ రెండు ఇంతలు అవుతుందని వారు గతంలో చేసిన మోసం బయటకు వస్తుందని కొంతమంది బడా పారిశ్రామిక వేత్తలు ఈ గ్రేడ్ ఖనిజంలకు టెండర్ వెయ్యనీయకుండా అధికారులను కొనేసారాని వారు ఆరోపించారు, బయ్యర్స్ వద్ద వసూలు చేసిన చెస్ అమౌంట్ ను యాజమాన్యం ఎవరికి చెల్లెస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు,ఇంత అవినీతి, అక్రమాలు ఏపీఎండీసీ లో జరుగుతుంటే కూటమి ప్రభుత్వం ఏమి చేస్తుందో అర్థం కావటం లేదని అన్నారు,ప్రభుత్వ పెద్దలు కూడా ఇందులో మామూళ్ళ మత్తులో ఉన్నారని అందుకే పట్టించుకోలేదని అన్నారు, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని జరిగిన నష్టానికి కారణమైన వారి పైన చర్యలు తీసుకుని వెంటనే టెండర్ ను పిలవాలని డిమాండ్ చేశారు, లేని పక్షంలో కలసి వచ్చే వారిని కలుపుకుని బారీ ఎత్తున పోరాటాలకు దిగుతామని వారు ప్రభుత్వాన్ని, యాజమాన్యం ను హెచ్చరించారు

ఓబులవారిపల్లె అక్టోబర్ పున్నమి ప్రతినిధి

ఏపీఎండీసీ సంస్థ నందు A గ్రేడ్ B గ్రేడ్ మరియు C&D గ్రేడ్ ఖనిజాలకు సుమారు సంవత్సర కాలంగా టెండర్లు పిలవకుండా ఎవరికి మేలు చేస్తున్నారని ఏపీఎండీసీ యాజమాన్యం పై మండిపడిన
సీఐటీయూ జిల్లా నాయకులు

ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి సీఐటీయూ అన్నమయ్య జిల్లా అధ్యక్ష&కార్యదర్శులు సిహెచ్ చంద్రశేఖర్, రామాంజినేయులు మాట్లాడుతూ

ఏపీఎండీసీ సంస్థ స్థాపించి సుమారు 50 సంవత్సరములలో ఏపీఎండీసీ సంస్థలో ఇంత అవినీతి అరాచక పాలన ఎప్పుడూ చూడలేదని సీఐటీయూ నాయకులు మండిపడ్డారు,
A గ్రేడ్ బి గ్రేడ్ C&D గ్రేడ్ ఖనిజాలకు టెండర్ పిలిచి ఆ టెండర్ ను రద్దు చేసి తిరిగి టెండర్లు సుమారు సంవత్సరకాలం అవుతున్నా పిలవక పోవడంలో అంతర్యం ఏమిటో,ఏపీఎండీసీ యాజమాన్యం చెప్పాలని వారు డిమాండ్ చేశారు,దీనివలన సంస్థకు కోట్లాది రూపాయలు గండి పడుతుంటే కూటమి ప్రభుత్వం చోధ్యం చూస్తున్నారని అన్నారు, గతంలో C&D గ్రేడ్ బల్క్ టెండర్ ను రేట్ తగ్గించి ఒక బయ్యర్ కు కట్టపెట్టిన దానివలన సంస్థకు కోట్లాది రూపాయలు గండి పడింది, దీని వలన కొంత మంది బయ్యర్స్ మాకు కూడా ఖనిజం రేట్ తగ్గించి ఇవ్వాలని కోర్ట్ ను ఆశ్రయించారు, ఇప్పుడు ఏపీఎండీసీ టెండర్లు పిలిస్తే సంస్థ చేసిన తప్పు బయటపడుతుందని టెండర్స్ పిలవకుండా సంస్థ మనుగడే లేకుండా చేస్తున్నారని అన్నారు
ఏపీఎండీసీ యాజమాన్యం వారు చేస్తున్న తప్పుకు సంస్థ నిర్వర్యం అవుతుందనివీటిని మేము లెక్కళ్ళతో సహా చెబుతున్నామని ఇది చూసైనా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు
ఏపీఎండీసీ యాజమాన్యం వారు చేస్తున్న సంస్థ లూటీలో ఒక గ్రేడ్ ఉదాహరణ గా
A గ్రేడ్ ఖనిజం ఒక టన్ను విలువ వివరాలు :
*గత టెండర్ లో బేసిక్ ప్రైస్:7226
*సీనరీజస్ చార్జెస్ :480 రూపాయలు
*సీనరీజస్ మీద డియంయఫ్ చార్జెస్ 30%
*సీనరీజస్ మీద 2% మెరిట్ చార్జెస్
*చెస్ చార్జెస్ 20 రూపాయలు
*లోడింగ్ చార్జెస్ 25 రూపాయలు
*వీటి అన్నిటికి 5 % GST కలిపి

= ఒక టన్ను A గ్రేడ్ ఖనిజం 8309 రూపాయలు గత టెండర్ లో ఉన్నింది

అయితే ఏపీఎండీసీ యాజమాన్యం వారు టెండర్లు అయిపోయి సుమారు ఒక సంవత్సరం పైన అవుతున్నా ఇంత వరకు టెండర్ పిలవకుండా గత టెండర్ లో వేసిన అమౌంట్ కు కేవలం 10 % మాత్రమే పెంచి ఈ ఖనిజాన్ని బయ్యర్స్ కు ఇస్తున్నారు ఇందులోనే అసలైన మెలిక ఉంది టెండర్ పిలిస్తే మూడు గ్రేడ్లకు ఖనిజానికి మంచి డిమాండ్ ఉంది కాబట్టి రేట్ రెండు ఇంతలు అవుతుందని వారు గతంలో చేసిన మోసం బయటకు వస్తుందని కొంతమంది బడా పారిశ్రామిక వేత్తలు ఈ గ్రేడ్ ఖనిజంలకు టెండర్ వెయ్యనీయకుండా అధికారులను కొనేసారాని వారు ఆరోపించారు, బయ్యర్స్ వద్ద వసూలు చేసిన చెస్ అమౌంట్ ను యాజమాన్యం ఎవరికి చెల్లెస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు,
ఇంత అవినీతి, అక్రమాలు ఏపీఎండీసీ లో జరుగుతుంటే కూటమి ప్రభుత్వం ఏమి చేస్తుందో అర్థం కావటం లేదని అన్నారు,ప్రభుత్వ పెద్దలు కూడా ఇందులో మామూళ్ళ మత్తులో ఉన్నారని అందుకే పట్టించుకోలేదని అన్నారు, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని జరిగిన నష్టానికి కారణమైన వారి పైన చర్యలు తీసుకుని వెంటనే టెండర్ ను పిలవాలని డిమాండ్ చేశారు, లేని పక్షంలో కలసి వచ్చే వారిని కలుపుకుని బారీ ఎత్తున పోరాటాలకు దిగుతామని వారు ప్రభుత్వాన్ని, యాజమాన్యం ను హెచ్చరించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.