అగనంపూడి, జనవరి 18 (పున్నమి ప్రతినిధి)

జివిఎంసి 79 వ వార్డు పరిధి లో స్థానిక కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్ అధ్యక్షతన అగనంపూడి, మరియు శివాజీ నగర్ పైలాన్ దగ్గర కీర్తిశేషులు నట సార్వభౌమ నందమూరి తారకరామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదుపరి గాజువాక పార్టీ కార్యాలయం లో రక్తదాన శిబిరం కార్యక్రమంలో పాల్గొని పలువురు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కరణం సత్యారావు, మాడిస వెంకట్రావు, వార్డు అధ్యక్షులు కరణం జగదీష్, కర్రి. దసేంద్ర, పివిఎన్ మూర్తి, మామిడి అప్పారావు, తైడా లక్షణరావు, జగదీష్, కొరాయి నాగార్జున, గంతకూర అప్పారావు, రేవతి, పల్లెల నాగేశ్వరరావు, గల్ల రాజు, సిహెచ్ రామనాయుడు గల్లా నర్సింగరావు, పప్పల సూర్య, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

