ఎం ఎన్ ఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గా.. ఏదుల నాగరాజు
గద్వాల్ (పున్నమి ప్రతినిధి)
గద్వాల్ జిల్లా గట్టు మండలం ఆరెగిద్ద గ్రామానికి చెందిన ఏదుల నాగరాజు గారు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గా ఎన్నికయ్యారు.
ఆయన మాట్లాడుతూ సమాజంలో ఉన్న మూఢనమ్మకాల నిర్మూలన, శాస్త్రీయ దృక్పథం వ్యాప్తి లక్ష్యంగా నిరంతరం ప్రజలను చైతన్య పరచడంలో ముందుండి పని చేస్తానని స్పష్టం చేశారు.
మహనీయుల ఆలోచన విధానాన్ని, శాస్తవ్రేత్తల త్యాగాలను సమాజానికి తెలియజేయంలో తన పాత్ర పోషిస్తానని,తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాలకు ఉద్యమాన్ని విస్తరించేందుకు కట్టుబడి పని చేస్తానని నాతో పాటు నూతన కమిటీ సమిష్టిగా కృషి చేస్తామని తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికను ఆమోదించి, అవసరమైన మార్పులు చేర్పులు చేసి ప్రమాణ స్వీకారం నిర్వహించిన డాక్టర్ బైరి నరేష్, సుజాత టీచర్‌లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
అలాగే ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించిన ఎన్నికల ఇంచార్జ్, కేంద్ర కమిటీ సభ్యులు కిలో రాంబాబు, యూత్ జాతీయ అధ్యక్ష కార్యదర్శులు అచ్చుత్ రాజ్, గోమాస సందీప్‌లకు రాష్ట్ర కమిటీ కి
ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించినందుకు నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు.


