ఈమెయిల్స్, ఫోన్ రాకతో ఉత్తరాలు రాయడం కనుమరుగైంది. మళ్ళీ లెటర్స్ ఆసక్తి కలిగించేందుకు తపాలా శాఖ ‘ధైయా ఆఖర్’ పోటీలు నిర్వహిస్తోంది. ‘లెటర్ టు మై రోల్ మోడల్’ థీమ్ మీద తెలుగు, ఇంగ్లీష్, హింది సహా ఏ భారతీయ భాషలోనైనా, ఏ వయస్సువారైనా లెటర్ వ్రాసి మీ పోస్టాఫీస్ సర్కిల్ అడ్రస్సుకు పంపాలి. చివరి తేదీ DEC 8. సర్కిల్ స్థాయిలో ₹25K, ₹10K, ₹5K, జాతీయ స్థాయిలో ₹50K, ₹25K, ₹10K చొప్పున బహుమతులు ఇస్తారు.


