Sunday, 22 March 2026
  • Home  
  • ఈ ఖరఫ్ సీజన్ లో రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు లక్ష్యం ధాన్యం కొనుగోలు. పై రైతులకు భరోసా కల్పించాలి. రైతులకు నష్టం జరుగరాదు, రైతులకు అండగా కూటమి ప్రభుత్వం. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్
- ఆంధ్రప్రదేశ్

ఈ ఖరఫ్ సీజన్ లో రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు లక్ష్యం ధాన్యం కొనుగోలు. పై రైతులకు భరోసా కల్పించాలి. రైతులకు నష్టం జరుగరాదు, రైతులకు అండగా కూటమి ప్రభుత్వం. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్

శ్రీకాకుళం,అక్టోబరు,13: 2025-26 ఖరీఫ్ సీజన్ లో రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షలు మైట్రక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ స్పష్టం చేశారు. కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఖరీఫ్ సీజన్ – 2025-26 ధాన్యం కొనుగోలు పై ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సమావేశానికి సంబంధించి జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో ఆయన పౌర సరఫరాల శాఖ కమీషనర్ సౌరబ్ గౌర్, పౌర సరఫరాల సంస్థ రాష్ట్ర మేనేజింగ్ డైరెక్టర్ మనజిర్ జిలాని సమూన్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ లతో కలిసి ఆయన సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు నష్టం జరుగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. కష్ట కాలంలో రైతులకు అండగా ఉండి, రైతులకు భరోసా కల్పించాలన్నారు. టార్ఫాలిన్స్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల నుంచి 48 గంటల్లోనే ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే జిల్లా యంత్రాంగం కలెక్టర్, జెసిలతో మాట్లాడాలని, రాష్ట్ర కార్యాలయం సమస్యలుపై వెసులుబాటు కల్పిస్తుందన్నారు. జెసిలు దృష్టి సారించి హాట్ స్పాట్ లు గుర్తించాలని ఆదేశించారు. సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని, ఎప్పటికప్పుడు టెలీకాన్ఫరెన్స్ లు ఏర్పాటు చేయాలన్నారు. గోనె సంచులు, రవాణాల పై దృష్టి సారించి జిపియస్ తప్పకుండా ఉండాలని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలును ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలని ఆదేశించారు. భారత దేశంలో లేని విధంగా రైతు వాట్సాప్ ద్వారా ధాన్యం విక్రయాలు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. ధాన్యం కొనుగోలులో రైతులకు నష్టం కలుగ కుండా చూడాలని, తూకంలో ఏలాంటి తప్పులు జరుగరాదని స్పష్టం చేశారు. మిల్లర్లు తప్పులు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. త్వరలోనే రాష్ట్ర స్థాయి సమావేశం జరుగుతోందన్నారు. రైతు సేవా కేంద్రాలు వద్ద తేమ చూసే మిషన్ లను ముందుగానే ఏర్పాటు చేసుకోవాలన్నారు.. గత యేడాది రైతులకు టార్ఫాలిన్స్ 50 శాతం తో పంపిణీ చేయడమైనదని, ఈ యేడాది శత శాతం సబ్సిడీ తో సరఫరా చేస్తామన్నారు. అకాల వర్షాలు వస్తే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, రైతులకు నష్టం జరుగరాదని తెలిపారు. రైతులకు భరోసా కల్పించి మద్దతు ధరలు కల్పించాలన్నారు. ఎన్ ఫోర్స్ మెంట్ చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. గోనె సంచులపై జెసీలు దృష్టి సారించాలని ఆదేశించారు. రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే తక్షణమే మా దృష్టికి తీసుకురావాలని చెప్పారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరబ్ గౌర్ మాట్లాడుతూ రైతులు పండించే పంటలు రైతు సేవా కేంద్రాల్లో కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. రైతు సేవా కేంద్రాల్లో తప్ప చేస్తే వేరే ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ధాన్యం తరలించేందుకు ఒక్కో జిల్లాకు 5 వేల వాహనాలు ఏర్పాటు చేసుకోవాలని, రైతు సేవా కేంద్రాలు వారీగా టార్ఫలీన్లు సరఫరా చేయనున్నట్లు చెప్పారు. గోనె సంచులు అవసరాన్ని అంచనా వేసుకొని గోనెసంచులు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లు పై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గోనె సంచులు, రవాణాలపై దృష్టి సారించాలన్నారు. మనజీర్ జిలానీ సమూన్ మాట్లాడుతూ గత యేడాది చేసిన ధాన్యం సేకరణలో ఉన్న సమస్యలు పునరావృత్తం కారాదన్నారు. జిపియస్ వాహనాలు ద్వారా మాత్రమే తరలించాలన్నారు. రవాణా, గోనె సంచులు, సమస్యలు ఏమైనా ఉంటే ఉన్నతాధికారులను సంప్రదించాలన్నారు. సమస్యలు పునరావృత్తం రాకుండా చూడాలని చెప్పారు. గోనె సంచులు పై దృష్టి సారించాలని చెప్పారు. వాహనాల సమస్య లేకుండా చూడాలని జెసిలు ఆదేశించారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ధాన్యం సేకరణ పై వివరించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ గత యేడాది జిల్లాలో అకాల తుఫానులు సంభవించినట్లు చెప్పారు. ఆ సమయంలో కొంత మేర రైతులు పంట నష్టపోయినట్లు చెప్పారు. టార్ఫాలిన్స్ పంపిణీ చేసినట్లు చెప్పారు. ప్రస్తుత ఏర్పాట్లను వివరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు గత సీజన్ లో ఉన్న అనుభవాలు, ఈ ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణకు చేసిన ఏర్పాట్లు, ధాన్యం సేకరణ పై సిబ్బందికి శిక్షణ, అకాలంగా వచ్చే వర్షాల ఏర్పాట్లు పై మంత్రికి వివరించారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ డేటా ఎంట్రీ ఆపరేటర్లు, టెక్నికల్, తదితర సిబ్బందికి జీతభత్యాలు కోసం మంత్రి దృష్టికి తీసుకురాగా మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో పాలకొండ శాసన సభ్యులు నిమ్మక జయకృష్ణ, రాష్ట్ర పౌర సరఫరాలు, ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ సంచాలకులు ఆర్. గోవిందరావు, శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఎఎస్ఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ పూజిత, అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. జాహ్నవి, విశాఖపట్నం కె. మయూర్ అశోక్, విజయనగరం ఎస్. సేధు మాధవన్, పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి, వ్యవసాయ, రవాణా, కోపరేటివ్, లీగల్ మెట్రాలజి, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

శ్రీకాకుళం,అక్టోబరు,13: 2025-26 ఖరీఫ్ సీజన్ లో రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షలు మైట్రక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ స్పష్టం చేశారు. కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఖరీఫ్ సీజన్ – 2025-26 ధాన్యం కొనుగోలు పై ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సమావేశానికి సంబంధించి జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో ఆయన పౌర సరఫరాల శాఖ కమీషనర్ సౌరబ్ గౌర్, పౌర సరఫరాల సంస్థ రాష్ట్ర మేనేజింగ్ డైరెక్టర్ మనజిర్ జిలాని సమూన్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ లతో కలిసి ఆయన సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు నష్టం జరుగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు.
కష్ట కాలంలో రైతులకు అండగా ఉండి, రైతులకు భరోసా కల్పించాలన్నారు. టార్ఫాలిన్స్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల నుంచి 48 గంటల్లోనే ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే జిల్లా యంత్రాంగం కలెక్టర్, జెసిలతో మాట్లాడాలని, రాష్ట్ర కార్యాలయం సమస్యలుపై వెసులుబాటు కల్పిస్తుందన్నారు. జెసిలు దృష్టి సారించి హాట్ స్పాట్ లు గుర్తించాలని ఆదేశించారు. సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని, ఎప్పటికప్పుడు టెలీకాన్ఫరెన్స్ లు ఏర్పాటు చేయాలన్నారు. గోనె సంచులు, రవాణాల పై దృష్టి సారించి జిపియస్ తప్పకుండా ఉండాలని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలును ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలని ఆదేశించారు. భారత దేశంలో లేని విధంగా రైతు వాట్సాప్ ద్వారా ధాన్యం విక్రయాలు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. ధాన్యం కొనుగోలులో రైతులకు నష్టం కలుగ కుండా చూడాలని, తూకంలో ఏలాంటి తప్పులు జరుగరాదని స్పష్టం చేశారు. మిల్లర్లు తప్పులు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. త్వరలోనే రాష్ట్ర స్థాయి సమావేశం జరుగుతోందన్నారు. రైతు సేవా కేంద్రాలు వద్ద తేమ చూసే మిషన్ లను ముందుగానే ఏర్పాటు చేసుకోవాలన్నారు.. గత యేడాది రైతులకు టార్ఫాలిన్స్ 50 శాతం తో పంపిణీ చేయడమైనదని, ఈ యేడాది శత శాతం సబ్సిడీ తో సరఫరా చేస్తామన్నారు. అకాల వర్షాలు వస్తే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, రైతులకు నష్టం జరుగరాదని తెలిపారు. రైతులకు భరోసా కల్పించి మద్దతు ధరలు కల్పించాలన్నారు. ఎన్ ఫోర్స్ మెంట్ చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. గోనె సంచులపై జెసీలు దృష్టి సారించాలని ఆదేశించారు. రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే తక్షణమే మా దృష్టికి తీసుకురావాలని చెప్పారు.

పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరబ్ గౌర్ మాట్లాడుతూ రైతులు పండించే పంటలు రైతు సేవా కేంద్రాల్లో కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. రైతు సేవా కేంద్రాల్లో తప్ప చేస్తే వేరే ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ధాన్యం తరలించేందుకు ఒక్కో జిల్లాకు 5 వేల వాహనాలు ఏర్పాటు చేసుకోవాలని, రైతు సేవా కేంద్రాలు వారీగా టార్ఫలీన్లు సరఫరా చేయనున్నట్లు చెప్పారు. గోనె సంచులు అవసరాన్ని అంచనా వేసుకొని గోనెసంచులు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లు పై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గోనె సంచులు, రవాణాలపై దృష్టి సారించాలన్నారు.

మనజీర్ జిలానీ సమూన్ మాట్లాడుతూ గత యేడాది చేసిన ధాన్యం సేకరణలో ఉన్న సమస్యలు పునరావృత్తం కారాదన్నారు. జిపియస్ వాహనాలు ద్వారా మాత్రమే తరలించాలన్నారు. రవాణా, గోనె సంచులు, సమస్యలు ఏమైనా ఉంటే ఉన్నతాధికారులను సంప్రదించాలన్నారు. సమస్యలు పునరావృత్తం రాకుండా చూడాలని చెప్పారు. గోనె సంచులు పై దృష్టి సారించాలని చెప్పారు. వాహనాల సమస్య లేకుండా చూడాలని జెసిలు ఆదేశించారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ధాన్యం సేకరణ పై వివరించారు.

జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ గత యేడాది జిల్లాలో అకాల తుఫానులు సంభవించినట్లు చెప్పారు. ఆ సమయంలో కొంత మేర రైతులు పంట నష్టపోయినట్లు చెప్పారు. టార్ఫాలిన్స్ పంపిణీ చేసినట్లు చెప్పారు. ప్రస్తుత ఏర్పాట్లను వివరించారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు గత సీజన్ లో ఉన్న అనుభవాలు, ఈ ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణకు చేసిన ఏర్పాట్లు, ధాన్యం సేకరణ పై సిబ్బందికి శిక్షణ, అకాలంగా వచ్చే వర్షాల ఏర్పాట్లు పై మంత్రికి వివరించారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ డేటా ఎంట్రీ ఆపరేటర్లు, టెక్నికల్, తదితర సిబ్బందికి జీతభత్యాలు కోసం మంత్రి దృష్టికి తీసుకురాగా మంత్రి సానుకూలంగా స్పందించారు.

ఈ సమావేశంలో పాలకొండ శాసన సభ్యులు నిమ్మక జయకృష్ణ, రాష్ట్ర పౌర సరఫరాలు, ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ సంచాలకులు ఆర్. గోవిందరావు, శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఎఎస్ఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ పూజిత, అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. జాహ్నవి, విశాఖపట్నం కె. మయూర్ అశోక్, విజయనగరం ఎస్. సేధు మాధవన్, పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి, వ్యవసాయ, రవాణా, కోపరేటివ్, లీగల్ మెట్రాలజి, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.