Friday, 27 March 2026
  • Home  
  • ఇస్సన్నపల్లిలో కాలభైరవుని బ్రహ్మోత్సవం : అగ్నిగుండాల పాదయాత్రలో భక్తి జ్వాలలు.
- కామారెడ్డి

ఇస్సన్నపల్లిలో కాలభైరవుని బ్రహ్మోత్సవం : అగ్నిగుండాల పాదయాత్రలో భక్తి జ్వాలలు.

– ధర్మబోధతో మంత్రముగ్ధులైన భక్తులు రామారెడ్డి మండల ప్రజలు కామారెడ్డి, 13 నవంబర్, (పున్నమి ప్రతినిధి) : ఇస్సన్నపల్లి గ్రామం ఉదయం వెలుగు రాకముందే భక్తి తరంగాల్లో తేలింది. కామారెడ్డి జిల్లా, రామారె డ్డి మండలం,ఇస్సన్నపల్లి గ్రామంలో శ్రీ కాలభైరవ స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రారంభమైన బ్రహ్మో త్సవ వేడుకలు, భక్తుల ఆరాధనతో ఒక ఆధ్యాత్మి క ఉత్సవమైమారాయి. ఘంటానాదాల మధ్య స్వామి రథం ఆలయ ఇరు గ్రామాల పురవీధుల గుండా తిరుగుతుండగా, “భైరవ శరణం.. ఓం ఓం భైరవ ” అంటూ ప్రతిధ్వనించిన నినాదాలు గాలిని మంత్ర ముగ్ధం చేశాయి. వీరశైవుల ఆధ్వర్యంలో అగ్నిగుండాల గుండా భగభగ కాల్ నిప్పులపై పాదలతో నడుచుకుంటూ వెళ్లిన భక్తులు అందరి దృష్టినీ ఆకర్షించారు. అగ్ని మీద నిరభయంగా వేసిన ప్రతి అడుగు భైరవునిపై ఉన్న అచంచల నమ్మకానికి ప్రతీకగా నిలిచింది. నిప్పుల మీద నడిచిన ఆక్షణం భయం కరిగిపోయి విశ్వా సం వెలిగిన క్షణమైంది. గ్రామస్తులు అగ్నిగుండాల చుట్టూ వాల్మీకి శ్లోకాలు, భజనలు ఆలపించారు. ఆ అనంత భక్తిభావంలో తేలారు. స్వామీజీ ప్రవచ నాలు ఆధ్యాత్మిక చైతన్యాన్ని రేపాయి. “భైరవుడు భయాన్ని గెలిపించే శక్తి కాదు, భయాన్ని తొలగించే దైవ తత్త్వం” అంటూ ఆయన వివరించగా, భక్తులు కళ్లలో తళుకులు మెరిశాయి. ధర్మం, భయరహిత జీవనం, భక్తి వినమ్రత వంటి విలువలను స్వీకరిం చాలని ఆయన సందేశం ఇచ్చారు.సాయంత్రం ఆలయంలో దీపారాధనతో చీకట్లు కరిగిపోయా యి. సువాసనతో నిండిన అన్నదాన సత్కారాలు జరిగి, గ్రామమంతా విశ్వా స సుగంధంతో తేలింది. ప్రతి భక్తుని చేతిలో ప్రసా దం మాత్రమే కాదు, హృదయంలో ఒక కాంతి వెలిగింది. రాత్రి వేళలో వేల దీపాలతో మెరిసిన కాలభైరవ ఆలయం, ఇస్సన్నపల్లి ఆత్మను ఆశీర్వ దించినట్లు కనిపించిం ది.ఆ ఒక రాత్రి భక్తి రూపం లో దేవుడు మనమధ్య నడిచిన అనుభూతిని అందించింది.ఈ కార్యక్రమం లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్, ఆలయ ఈవో ప్రభు స్వామి, ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ పంతులు, వీరశైవులు జంగం ప్రభు స్వామి,జంగం కుమారస్వామి, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల నాయకులు గ్రామ నాయకులు కార్యకర్త లు దాతలు భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు.

– ధర్మబోధతో మంత్రముగ్ధులైన భక్తులు రామారెడ్డి మండల ప్రజలు

కామారెడ్డి, 13 నవంబర్, (పున్నమి ప్రతినిధి) :

ఇస్సన్నపల్లి గ్రామం ఉదయం వెలుగు రాకముందే భక్తి తరంగాల్లో తేలింది. కామారెడ్డి జిల్లా, రామారె డ్డి మండలం,ఇస్సన్నపల్లి గ్రామంలో శ్రీ కాలభైరవ స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రారంభమైన బ్రహ్మో త్సవ వేడుకలు, భక్తుల ఆరాధనతో ఒక ఆధ్యాత్మి క ఉత్సవమైమారాయి. ఘంటానాదాల మధ్య స్వామి రథం ఆలయ ఇరు గ్రామాల పురవీధుల గుండా తిరుగుతుండగా, “భైరవ శరణం.. ఓం ఓం భైరవ ” అంటూ ప్రతిధ్వనించిన నినాదాలు గాలిని మంత్ర ముగ్ధం చేశాయి. వీరశైవుల ఆధ్వర్యంలో అగ్నిగుండాల గుండా భగభగ కాల్ నిప్పులపై పాదలతో నడుచుకుంటూ వెళ్లిన భక్తులు అందరి దృష్టినీ ఆకర్షించారు. అగ్ని మీద నిరభయంగా వేసిన ప్రతి అడుగు భైరవునిపై ఉన్న అచంచల నమ్మకానికి ప్రతీకగా నిలిచింది. నిప్పుల మీద నడిచిన ఆక్షణం భయం కరిగిపోయి విశ్వా సం వెలిగిన క్షణమైంది. గ్రామస్తులు అగ్నిగుండాల చుట్టూ వాల్మీకి శ్లోకాలు, భజనలు ఆలపించారు. ఆ అనంత భక్తిభావంలో తేలారు. స్వామీజీ ప్రవచ నాలు ఆధ్యాత్మిక చైతన్యాన్ని రేపాయి. “భైరవుడు భయాన్ని గెలిపించే శక్తి కాదు, భయాన్ని తొలగించే దైవ తత్త్వం” అంటూ ఆయన వివరించగా, భక్తులు కళ్లలో తళుకులు మెరిశాయి. ధర్మం, భయరహిత జీవనం, భక్తి వినమ్రత వంటి విలువలను స్వీకరిం చాలని ఆయన సందేశం ఇచ్చారు.సాయంత్రం ఆలయంలో దీపారాధనతో చీకట్లు కరిగిపోయా యి. సువాసనతో నిండిన అన్నదాన సత్కారాలు జరిగి, గ్రామమంతా విశ్వా స సుగంధంతో తేలింది. ప్రతి భక్తుని చేతిలో ప్రసా దం మాత్రమే కాదు, హృదయంలో ఒక కాంతి వెలిగింది. రాత్రి వేళలో వేల దీపాలతో మెరిసిన కాలభైరవ ఆలయం, ఇస్సన్నపల్లి ఆత్మను ఆశీర్వ దించినట్లు కనిపించిం ది.ఆ ఒక రాత్రి భక్తి రూపం లో దేవుడు మనమధ్య నడిచిన అనుభూతిని అందించింది.ఈ కార్యక్రమం లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్, ఆలయ ఈవో ప్రభు స్వామి, ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ పంతులు, వీరశైవులు జంగం ప్రభు స్వామి,జంగం కుమారస్వామి, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల నాయకులు గ్రామ నాయకులు కార్యకర్త లు దాతలు భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.