Wednesday, 25 March 2026
  • Home  
  • ఆన్‌లైన్ బుకింగ్ విఫలం… గ్యాస్ కోసం గ్రామస్తుల పరుగులు
- తూర్పు గోదావరి

ఆన్‌లైన్ బుకింగ్ విఫలం… గ్యాస్ కోసం గ్రామస్తుల పరుగులు

పున్నమి ప్రతినిధి, తాళ్లపూడి (తూర్పుగోదావరి జిల్లా)మార్చి 24:మండలంలోని వేగేశ్వరపురం గ్రామంలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా కనిపిస్తోంది. గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకుని 15 రోజులు గడిచినా సరఫరా జరగడం లేదని గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారులు ఆన్లైన్‌లో బుకింగ్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ సక్రమంగా నమోదు కాకపోవడం వల్ల పలుమార్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోతుందని చెబుతున్నారు. దీంతో ప్రత్యక్షంగా గ్యాస్ ఏజెన్సీలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా గ్యాస్ కంపెనీల కార్యాలయాల వద్ద భారీ రద్దీ నెలకొంది. మరోవైపు వినియోగదారుల తాకిడి పెరగడంతో డిస్ట్రిబ్యూటర్ కార్యాలయాల సిబ్బంది కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం వేగేశ్వరపురం గ్రామంలోకి హెచ్.పీ గ్యాస్ ఆటో చేరుకోగానే ప్రజలు ఒక్కసారిగా ఖాళీ సిలిండర్లు పట్టుకుని ఆటో వద్దకు పరుగులు తీశారు. ఆన్లైన్‌లో బుకింగ్ చేయని వారు కూడా గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని డ్రైవర్లపై ఒత్తిడి తెచ్చారు. దీంతో గ్యాస్ సరఫరా సిబ్బంది దిక్కుతోచని స్థితిలో ఆందోళనకు గురయ్యారు. “బుకింగ్ లేకుండా గ్యాస్ ఎలా ఇవ్వగలం” అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో భారీగా గుమికూడిన జనసమూహాన్ని చూసి గ్యాస్ ఆటో అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా, అవసరం లేకపోయినా నిల్వ కోసం గ్యాస్ సిలిండర్లు సేకరించే ధోరణి పెరగడం కూడా సమస్యను మరింత తీవ్రం చేస్తున్నదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకుని గ్యాస్ సరఫరా వ్యవస్థను సక్రమంగా నిర్వహించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

పున్నమి ప్రతినిధి, తాళ్లపూడి (తూర్పుగోదావరి జిల్లా)మార్చి 24:మండలంలోని వేగేశ్వరపురం గ్రామంలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా కనిపిస్తోంది. గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకుని 15 రోజులు గడిచినా సరఫరా జరగడం లేదని గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వినియోగదారులు ఆన్లైన్‌లో బుకింగ్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ సక్రమంగా నమోదు కాకపోవడం వల్ల పలుమార్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోతుందని చెబుతున్నారు. దీంతో ప్రత్యక్షంగా గ్యాస్ ఏజెన్సీలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా గ్యాస్ కంపెనీల కార్యాలయాల వద్ద భారీ రద్దీ నెలకొంది.
మరోవైపు వినియోగదారుల తాకిడి పెరగడంతో డిస్ట్రిబ్యూటర్ కార్యాలయాల సిబ్బంది కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో మంగళవారం వేగేశ్వరపురం గ్రామంలోకి హెచ్.పీ గ్యాస్ ఆటో చేరుకోగానే ప్రజలు ఒక్కసారిగా ఖాళీ సిలిండర్లు పట్టుకుని ఆటో వద్దకు పరుగులు తీశారు. ఆన్లైన్‌లో బుకింగ్ చేయని వారు కూడా గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని డ్రైవర్లపై ఒత్తిడి తెచ్చారు.
దీంతో గ్యాస్ సరఫరా సిబ్బంది దిక్కుతోచని స్థితిలో ఆందోళనకు గురయ్యారు. “బుకింగ్ లేకుండా గ్యాస్ ఎలా ఇవ్వగలం” అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో భారీగా గుమికూడిన జనసమూహాన్ని చూసి గ్యాస్ ఆటో అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.
ఇదిలా ఉండగా, అవసరం లేకపోయినా నిల్వ కోసం గ్యాస్ సిలిండర్లు సేకరించే ధోరణి పెరగడం కూడా సమస్యను మరింత తీవ్రం చేస్తున్నదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
అధికారులు తక్షణ చర్యలు తీసుకుని గ్యాస్ సరఫరా వ్యవస్థను సక్రమంగా నిర్వహించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.